KASULAMALA PROCESSION HELD _ ల‌క్ష్మీ కాసులహారం శోభాయాత్ర

TTD JEO RECEIVES AT TIRUCHANOOR

TO BE DECORATED TO GODDESS PADMAVATHI

TIRUMALA, 04 DECEMBER 2021: The procession of Lakshmi Kasula Haram was held in Tirumala on Saturday.

As a part of the tradition, this famous Haram which is usually decked to Sri Malayappa Swamy on Garuda Seva every year during annual Brahmotsavam, was paraded along four Mada streets and sent to Tiruchanoor and will be decorated to Goddess Padmavati for Gaja Vahana Seva to be held on Saturday evening.

Additional EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Ramesh Babu, Peishkar Sri Srihari were present.

JEO RECEIVES KASULA HARAM

At Tiruchanoor, TTD JEO Sri Veerabrahmam received the Kasula Haram.

Special pujas were performed to the Lakshmi Kasula Haram.

This will be decorated to Goddess Padmavati during Gaja Vahana Seva on December 4 and also on Garuda Seva on December 5.

Temple DyEO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమ‌ల‌లో ల‌క్ష్మీ కాసులహారం శోభాయాత్ర

తిరుచానూరుకు చేరిన‌ తిరుమల శ్రీవారి లక్ష్మీకాసులహారం

 తిరుపతి, 2021 డిసెంబ‌రు 04: తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా శ‌ని, ఆదివారాల్లో జ‌రుగ‌నున్న గ‌జ, గ‌రుడ వాహ‌న‌సేవ‌ల్లో అలంక‌రించేందుకు తిరుమ‌ల శ్రీ‌వారి ల‌క్ష్మీకాసుల హారాన్ని శ‌నివారం ఉద‌యం తిరుచానూరుకు తీసుకొచ్చారు.

ముందుగా తిరుమ‌లలో శ్రీవారి ఆల‌యం నుండి ఈ హారాన్ని ఆల‌య నాలుగు వీధుల్లో ఊరేగించి తిరుచానూరుకు తీసుకొచ్చారు.

తిరుమ‌ల‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి , ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి పాల్గొన్నారు.

తిరుచానూరులో శ్రీవారి లక్ష్మీకాసులహారం స్వీకరించిన‌ టిటిడి జెఈవో

అనంత‌రం తిరుమ‌ల‌ నుండి వాహ‌నంలో భ‌ద్ర‌త నడుమ తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యానికి తీసుకొచ్చారు. టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మంకు అంద‌జేశారు. అక్క‌డ హారానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ ఆల‌యంలోకి తీసుకెళ్లారు. ఆల‌య ప్రాంగ‌ణంలో ప్ర‌ద‌క్షిణ‌గా గ‌ర్భాల‌యంలోకి తీసుకెళ్లారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఆగమ సలహాదారు మ‌రియు కంక‌ణ‌బ‌ట్టార్‌ శ్రీ శ్రీనివాసాచార్యులు, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబు స్వామి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.