KAT AT SRI GT ON MAY 13 _ మే 13న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 5 May 2021: TTD is organising the Koil Alwar Thirumanjanam fete at the Sri Govindaraja Swamy temple on May 13 as part of the ensuing annual Brahmotsavam from May 18-26 held in ekantham in view of Covid guidelines.

After daily morning rituals, the Koil Alwar Thirumanjanam fete began at 09.30- 10.30 am as per the traditional practise of conducting temple cleansing on Tuesday ahead of the nine-day Brahmotsavam

Archakas and officials participated in the cleansing event with desi and herbal detergents and thereafter sprinkled aromatic waterfall around before allowing devotees for Darshan.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 13న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2021 మే 05: తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆలయంలో మే 13వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మే 18 నుండి 26వ తేదీ వరకు జ‌ర‌గ‌నున్న వార్షిక బ్రహ్మోత్సవాలను కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో  ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా  తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 11 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.