CELEBRITY JAYANTHI’S AT TIRUMALA _ మే నెల‌లో మ‌హ‌నీయుల‌ జయంతులు

Tirumala, 5 May 2021: TTD is organising birth anniversaries of several celebrity Srivari devotees along with that of Sri Narasimha Swamy in the month of May.

They included the Jayanti of Saint poets and significant devotees Sri Thyagaraja, Sri Tallapaka Annamaiah and Matrusri Tarigonda Vengamamba.

TTD is organising the celebrations in total adherence to Covid guidelines through tout month.

SRI THYAGARAJA:

 On May 17, the TTD is organising the Jayanti of Sri Thyagaraja born on the same day in 1767 in Kakarla village of Prakasam district and as per legends, his intense Bhakti led the Narada Muni to bless him with a swarnavam book on music.

As Jagadguru of Carnatic music Thyagaraja in 1847 had come to Tirumala from Thiruvaiyaru and begot Srivari Darshan, TTD is conducting the Jayanti on Vaisakha Shudda Shasti day.

The Sri Thyagaraja Jayanti is also celebrated at Kakarla.

 SRI THALLAPAKA ANNAMACHARYA:

 He is popular as Annamaiah who penned 32,000 sankeetans in praise of Sri Venkateswara and is well known in the Telugu literary world as a patriarch of Telugu prose poetry.

He was born in Tallapaka village of YSR Kadapa district in 1408 .TTD is organising his Jayanti on May 25 at Annamacharya Kala Mandir and Dhyana Mandir at Tallapaka. On same day Sri Narasimha Jayanti is also celebrated at the Srivari temple.

MATRUSRI TARIGONDA VENGAMAMBA: 

 Popular as a dedicated devotee of Sri Venkateshwara was born in 1730 and well known for feeding the countless devotees who came to Tirumala.

The Vengamamba Jayanti is celebrated on May 25 at Annamacharya Kala Mandir and Vengamamba Samadhi at Tirumala in Ekantha.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే నెల‌లో మ‌హ‌నీయుల‌ జయంతులు
     
తిరుమల, 2021 మే 05: మే నెల‌లో భగవంతుడైన శ్రీ నరసింహస్వామి వారితోపాటు, శ్రీ‌వారి భక్తాగ్రగణ్యులైన శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ తాళ్లపాక అన్నమయ్య, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జన్మించారు. ధర్మప్రచారంలో భాగంగా ఈ మహనీయుల జయంతులను టిటిడి క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ జ‌యంతి ఉత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

శ్రీ త్యాగరాజస్వామి :

శ్రీ త్యాగరాజస్వామివారి జయంతిని మే 17వ తేదీన నిర్వహిస్తారు. వీరు 1767వ సంవత్సరంలో జన్మించారు. వీరి వంశీయులు ప్రకాశం జిల్లా కాకర్ల గ్రామానికి చెందినవారు. యుక్త వయసులో త్యాగయ్య భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు సంతోషించిన నారద మహర్షి స్వయంగా స్వరార్ణవం అనే సంగీత గ్రంథాన్ని ఇచ్చి ఆశీర్వదించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. సంగీత జగద్గురువుగా వినుతికెక్కిన త్యాగయ్య దాదాపు 180 సంవత్సరాల క్రితం తిరువయ్యార్‌ నుంచి తిరుమల క్షేత్రానికి విచ్చేసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈయన 1847వ సంవత్సరంలో పరమపదించారు. ఇంతటి గొప్పచరిత్ర గల త్యాగయ్య వ‌ర్థంతి ఆరాధనోత్సవాలను తిరువయ్యూరులో ప్రతి ఏటా పుష్యబహుళ పంచమినాడు నిర్వహిస్తారు.

త్యాగయ్య జయంతి వైశాఖ శుద్ధ ష‌ష్ఠి మే 17వ తేదీన వారి జన్మస్థలమైన ప్రకాశం జిల్లా కాకర్లలో త్యాగయ్యకు నిర్వహిస్తారు.

శ్రీ తాళ్లపాక అన్నమయ్య :
     
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని కీర్తిస్తూ 32 వేల కీర్తనలు రచించిన వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు. వీరు తొలి తెలుగు వాగ్గేయకారుడిగా, పదకవితా పితామహుడుగా  ప్రఖ్యాతి పొందారు. అన్నమయ్య జయంతిని మే 25న తిరుపతి అన్న‌మాచార్య క‌ళామందిరం, తాళ్లపాకలోని ధ్యాన‌మందిరంలో నిర్వహిస్తారు. అదేరోజున తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీనరసింహ జయంతి ఉత్సవం జరుగనుంది.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ :

శ్రీవారిపై అచంచలమైన భక్తివిశ్వాసాలు క‌లిగిన‌ శ్రీ తరిగొండ వెంగమాంబ 1730వ సంవత్సరంలో జన్మించారు. శ్రీ రాఘవేంద్రస్వామి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి లాగా తన బృందావనంలోనే 1817లో సజీవ సమాధి చెందారు. తిరుమలలో అన్నదానాన్ని ప్రారంభించినందుకు గుర్తుగా వెంగమాంబ పేరు ముందు మాతృశ్రీ అనే పదం చేరింది. టిటిడి ప్రతి ఏడాదీ వెంగమాంబ జయంతిని క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. వెంగమాంబ జయంతిని మే 25వ తేదీన తిరుపతి అన్న‌మాచార్య క‌ళామందిరంలో, తిరుమల వెంగ‌మాంబ బృందావ‌నంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.