KAT AT SRI SKVST ON FEB 6 _ ఫిబ్రవరి 6న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 5 Feb. 20: Ahead of annual Brahmotsavams at Sri Kalyana Venkateswara Swamy Temple in Srinivasa Mangapuram, the TTD is organising the holy trmple cleaning ritual of Koil Alwar Thirumanjanam on February 6. 

The annual Brahmotsavams is slated for February 14-22. In view of cleaning program, temple will remain shut from morning 6am-10.30am and open for pilgrims after 11.00 am.

TTD has cancelled the Tiruppavada seva on Thursday in view of the above program.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఫిబ్రవరి 6న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2020 ఫిబ్ర‌వ‌రి 05: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 6వ తేదీ గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో ఫిబ్రవరి 14 నుండి 22వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.00 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఈ కారణంగా ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో తిరుప్పావడ సేవ రద్దు చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.