KALYANOTSAVAM AT SRI KRT ON FEB 7 _ ఫిబ్ర‌వరి 7న శ్రీకోదండరామాలయంలో కల్యాణోత్సవం

Tirupati, 5 Feb. 20: TTD is organising Kalyanotsavam at the local temple of Sri Kodandarama Swamy Temple on February 7.

The event is scheduled on the occasion of birth star of Sri Ramachandra swami at 11.00 am.  Devotees could participate with a ticket of ₹500 and beget blessings and one uttarium, one blouse and and Anna Prasadam.

Later in the evening the Utsava idols of Sri Sita Lakshmana sameta Sri Ramachandra swami will be paraded along the Mada streets and later on taken to Ramachandra Pushkarani for Unjal seva.

Devotees taking part in Kalyanotsavam should come in traditional attire only.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఫిబ్ర‌వరి 7న శ్రీకోదండరామాలయంలో కల్యాణోత్సవం

తిరుపతి, 2020 ఫిబ్ర‌వ‌రి 05: శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వరి 7వ తేదీ శుక్ర‌వారం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది.

శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపడతారు. కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు సంప్రదాయ వస్త్రధారణలో రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.