KAT IN PAT HELD _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
TIRUPATI, 10 MAY 2022: In connection with three day annual Vasanthotsavams in Sri Padmavathi Ammavaru temple from May 15-17, Koil Alwar Tirumanjanam was performed on Tuesday.
While Ankurarpana will take place on May 14. The devotees shall pay Rs.150 and take part in the ritual.
Everyday Vasanthotsavam will be observed between 2:30pm and 4:30pm.
DyEO Sri Lokanatham, AEO Sri Prabhakar Reddy and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
మే 15 నుండి 17వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు
తిరుపతి, 2022 మే 10: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుధ్ధి నిర్వహించారు.
అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 15 నుండి 17వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం మే 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.
ఈ ఉత్సవాల్లో భాగంగా మే 15 నుండి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆలయంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపడతారు. అలాగే రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఈ ఉత్సవాల కారణంగా మే 15 నుండి 17వ తేదీ వరకు కల్యాణోత్సవం, సహస్రదీపాలంకారసేవ, మే 16న అష్టదళపాదపద్మారాధన ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దామోదరం పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.