NAAC A + GRADE TO SPWDPGC _ టీటీడీ శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పి.జి. కళాశాలకు నాక్ ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపు
FIRST WOMEN’S COLLEGE IN STATE TO BAG THE A +
GRADE
Tirupati, 10 May 2022: TTD-run Sri Padmavathi Women’s Degree and PG College set a record in the state of AP to bag NAAC A + Grade.
The NAAC committee released the certificate to the college on Tuesday for imparting qualitative education, maintenance of hostels.
Under the instructions of former TTD EO Dr KS Jawahar Reddy the college set the historical record in the state.
The NAAC team has visited on May 4 and 5 to the college under the stewardship of Smt Sada Bhargavi, JEO(H & E) in the supervision of Devasthanams Education Officer Sri C Govindarajan and the Principal Dr Maha Devamma.
The Chairperson of NAAC team, former VC of North Gujrat Varsity Sri Hemixa Rao, members Prof. Nandini Natarajan of Bengaluru University, Kaveri Women’s College of Tiruchirapalli, Principal Dr Sujata, Bengaluru NAAC Asst. Advisor Dr DK Kamble visited the college.
With this NAAC A + recognition, the students will now have opportunity for campus selections in international and multi national firms. The faculty will get research projects with ease. Necessary funds will be allotted. This will enable to appoint lecturers with expertise. And UGC funds special funds shall also be released to the college.
The SV Degree College of TTD in New Delhi also certified with NAAC A + Grade.
TTD EO (FAC) Sri AV Dharma Reddy appreciated the teaching and non-teaching and other staffs for their united efforts in getting the recognition to their respective colleges.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD TIRUPATI
టీటీడీ శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పి.జి. కళాశాలకు నాక్ ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపు
– రాష్ట్రంలో ఈ గుర్తింపు పొందిన తొలి మహిళా కళాశాలగా రికార్డ్
తిరుపతి 10 మే 2022: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పి.జి. కళాశాలకు నాక్ ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపు లభించింది. మాజీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని మహిళా కళాశాలల్లో ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపు పొందిన మొదటి కళాశాలగా రికార్డు సాధించింది.
కళాశాలలో మే 4, 5వ తేదీల్లో జెఈవో శ్రీమతి సదా భార్గవి నేతృత్వంలో, విద్యాశాఖ అధికారి శ్రీ గోవిందరాజన్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహదేవమ్మ నేతృత్వంలో నాక్ కమిటీ కళాశాలను సందర్శించింది. నాక్ కమిటీ చైర్‌పర్సన్‌గా నార్త్ గుజరాత్ విశ్వవిద్యాలయం మాజీ విసి ఆచార్య హెమిక్సారావు, సభ్యులుగా బెంగుళూరు విశ్వవిద్యాలయంకు చెందిన ఆచార్య నందిని నటరాజన్, తిరుచిరాపల్లి కావేరి మహిళ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుజాత, బెంగుళూరు నాక్ అసిస్టెంట్ అడ్వైజర్ డాక్టర్ డికె.కాంబ్లే కళాశాలను సందర్శించారు.
కళాశాలలోని వసతులు, విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్యా ప్రమాణాలు, కళాశాలలో అమలు చేస్తున్న విధానాలు వీటన్నింటిని పరిశీలించిన కమిటీ కళాశాలకు ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపును ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాలలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర సిబ్బంది సమిష్టి కృషి ఫలితంగానే టీటీడీ కళాశాలకు గొప్ప గుర్తింపు లభించిందని మాజీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అభినందించారు.
ఎ ప్లస్ గ్రేడ్ గుర్తింపు లభించడం వల్ల కళాశాలలో ప్రవేశాల సంఖ్య పెరిగి ఉన్నత విద్యలో మరింత నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయి. అంతర్జాతీయ సంస్థలు క్యాంపస్ ఇంటర్యూలు నిర్వహించడానికి ప్రాధాన్యతనిస్తాయి. ఉత్తమ విద్యా ప్రమాణాలు, వర్క్ షాపుల నిర్వహణ, ల్యాబ్‌ల ఏర్పాటుతో పాటు విద్యార్థులకు అనేక అవకాశాలు లభిస్తాయి. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలతో విజ్ఞానాన్ని పంచుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించడానికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి.
కళాశాల అధ్యాపకులకు పరిశోదక ప్రాజెక్టులు సులభంగా లభిస్తాయి. ఇందుకు అవసరమైన నిధులు సులభంగా మంజూరు అవుతాయి. తద్వారా కళాశాలకు పేరు ప్రతిష్టలు మరింతగా పెరిగి అనుభవం ఉన్న అధ్యాపకులతో పాటు నిష్ణాతులను నియమించుకునే అవకాశం లభిస్తుంది. దీంతో పాటు యుజిసి గుర్తింపు లభించి కళాశాలకు ప్రత్యేక నిధులు మంజూరవుతాయి. ఇదిలాఉండగా ఢిల్లీలో టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాలకు కూడా నాక్ ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపు లభించింది.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.