KAVACHA PRATISTA AT SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కవచ ప్రతిష్ఠ

Tirupati, 20 July 2021:  As part of the ongoing Jyestabisheka Mahotsavam at Sri Govindaraja Swamy temple in Tirupati, on the second day, the sacred ritual, Kavacha Pratista was performed in Ekantam in view of Covid guidelines.

In this connection, Sata Kalasa Snapanam, Mahashanti Homam, Snapana Tirumanjanam to utsava idols of Swamy and His consorts were conducted.

Thereafter Kavacha Pratista was performed with special pujas and the utsava idols of Sri Govindarajaswami, Sri Devi and Sri Bhudevi were later paraded in Tiruchi in the vimana prakaram of the temple.

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy, Sri Sri Sri Chinna Jeeyarswamy, Kankana Bhattar Sri Balaji Dikshitulu, AEO Sri Ravikumar Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కవచ ప్రతిష్ఠ

తిరుపతి, 2021 జూలై 20: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకంలో భాగంగా రెండ‌వ రోజైన మంగ‌ళ‌వారం కవచ ప్రతిష్ఠ జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ కార్య‌క్ర‌మాల‌ను ఆలయంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా ఉదయం శతకలశ స్నపనం, మహాశాంతి హోమం, స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కవచ ప్రతిష్ఠ చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని తిరుచ్చిపై ఆలయ విమాన ప్రాకారంలో ఊరేగిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయంగార్‌, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయంగార్‌, ఆల‌య ఏఇవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, కంక‌ణ బ‌ట్ట‌ర్ శ్రీ బాలాజి దీక్షితులు, సూపరింటెండెంట్లు శ్రీ వెంక‌టాద్రి, శ్రీ కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునీంద్ర‌బాబు, శ్రీ కామ‌రాజు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.