KERALA AND TAMILNADU SHOWCASE LOCAL DANCE AT BRAHMOTSAVAM_ గరుడసేవలో కేరళ, తమిళనాడు కళాబృందాల ప్రదర్శన
Tirumala, 14 October 2018: The Southern states -Kerala and Tamilnadu have showcased their local folk and performing arts at the ongoing Srivari Navaratri Brahmotsavams underway at the Mada streets during Vahana seva.
A 12 member team sponsored by the Sangeet Natak Academ was led by Sri Kunni Raman presented Mela and Pancha vadyam display which thrilled the devotees.
From Tamil Nadu the artists presented local folk dances like Karate and Bommalata (Doll dancers) carrying pots on Mada streets. Popular folk dances like Pompai attam, Kali Atttam, Tappattam, Tavil Nada swaram were presented with artists dressed as Sri Venkateswaraswamy, Sri Padmavati, Rukmini, Radhakrishna, Mariamman, Kali etc. and danced to drum beats and nada swaram.
Puli Attam, artists dressed, as tigers were a major attraction. Cultural Officer, of Tamil Nadu. Shankaranarayan led contingent sponsored by the Tamil Nadu Government.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
గరుడసేవలో కేరళ, తమిళనాడు కళాబృందాల ప్రదర్శన
అక్టోబరు 14, తిరుమల 2018: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం గరుడసేవలో ప్రదర్శనలు ఇచ్చేందుకు కేరళ రాష్ట్రానికి చెందిన శ్రీ కున్హిరామన్ నేతృత్వంలో 12 మంది కళాకారుల బృందం చెందన మేళం లేదా పంచ్ వాద్యం ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ వాయిద్యం వినసొంపుగా ఉంటుంది. అద్భుతశైలిలో వాయిస్తూ భక్తులను ఆకట్టుకోవడం వీరి ప్రత్యేకత. న్యూఢిల్లీకి చెందిన సంగీత నాటక అకాడమీ ఈ కళాబృందాన్ని పంపింది.
తమిళనాడు నుండి….
కరాట్టం అనేది తమిళనాడు జానపద నృత్యం, ఇందులో శిరస్సుపై బిందేలు ఉంచుకుని బిందెపై ప్రత్యేక బొమ్మతో నాట్యం చేస్తారు. అదేవిధంగా, పంపై అట్టం, కాళి అట్టం, తప్పట్టం, తవిళ్ నాదస్వరం కళారూపాలలో శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి, రుక్మిణి, రాధాకృష్ణులు, మారియమ్మన్, కాళి తదితర దేవతామూర్తుల వేషాలు ధరించి పంబలు, నాదస్వరం, డోలు తదితర వాయిద్యాలతో ప్రత్యేక విన్యాసాలతో నాట్యం చేేశారు. పులియట్టం కళా ప్రదర్శనలో పంబలు వాయిస్తూ పులి వేషం ధరించి నాట్యం చేశారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ బృందాలను పంపింది. ఈ కళాబృందాలకు శ్రీ శంకరనారాయణ్ నేతృత్వం వహించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.