KARNATAKA FOLK DANCES THRILL DEVOTEES ON MADA STREETS_ గ‌రుడ‌సేవ‌లో కర్ణాటక రాష్ట్రం క‌ళాబృందాలు

Tirumala, 14 October 2018: Pujaitha Kunitha (dance of worship) a highlight of the Karnataka tribals culture was showcased at the Mada streets this morning in front of the Mohini vahanam during the ongoing Srivari Navaratri Brahmotsavams on Sunday.

81 artists led by M Kavita performed the Pujita Kunita while other teams led Nagaraj staged Dollu Kunita, Chili pili gumbe (chattering doll), Yakshagana, Sumana Kunita and Kongelu kunita. The artists presentations were coordinated by the Karnataka Govt and the Sangeet Natak Academy, Delhi The 29 artists of Srinivasa Yuva Bhajan mandali from Karikada in Mangalore district presented Krishna Leela in which Srikrishna and Gopikas enthralled the devotees with their dance poses.

Sri Siddaraju of Bangalore said the teams were presenting performances at the Srivari Brahmotsavam for last 7 years. An 11-member artists team of Chandra Balaga from Blkale, Udupi presented their Chandra drum beating.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

గ‌రుడ‌సేవ‌లో కర్ణాటక రాష్ట్రం క‌ళాబృందాలు

అక్టోబ‌రు 14, తిరుమల 2018: శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఆదివారం గ‌రుడ‌సేవ‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చేందుకు క‌ర్ణాటక నుండి 6 బృందాల్లో 81 మంది కళాకారులు వచ్చారు. పూజ కునిత క‌ళారూపం బృందానికి శ్రీమ‌తి ఎం.క‌విత నేతృత్వం వ‌హించారు. డొల్లు కునిత, చిలి పిలి గొంబె, యక్షగాన, సమన కునిత, కొంగేలు క‌ళాబృందాల‌కు శ్రీ కె.నాగ‌రాజు నేతృత్వం వ‌హించారు. న్యూఢిల్లీకి చెందిన సంగీత నాటక అకాడమీ, కర్ణాట‌క రాష్ట్ర ప్రభుత్వం క‌లిసి ఈ బృందాలను పంపాయి. ఆదివారం ఉద‌యం జ‌రిగిన మోహినీ అవ‌తారోత్స‌వంలో కర్ణాటక రాష్ట్రం చిక్ మంగళూరు జిల్లా కరికర ప్రాంతం నుండి వచ్చిన శ్రీనివాస యువ భజన మండలి కళాకారులు బృందావనంలో కృష్ణలీలోత్సవం ప్రదర్శన చేశారు. నాలుగు మాడ వీధులలో లయబద్ధంగా 29 మంది కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. శ్రీకృష్ణుడు, గోపికల ప్రదర్శన ఆకట్టుకుంది. గత 7 సంవత్సరాల నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ప్రదర్శనలు ఇస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. అదేవిధంగా, ఉడిపికి చెందిన బెల్కలే ఛండ బలెగ కళాబృందం ఆధ్వర్యంలో 11 మంది కళాకారులు చండీ వాయిద్యాన్ని ప్రదర్శించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.