KODANDARAMA ALOFT GARUDA VAHANA _ గ‌రుడ‌ వాహనంపై శ్రీ కోదండ‌‌రాముడు

Vontimitta, 25 Apr. 21: TTD organised the holiest and grandeur of all vahanas, Garuda vahana, on Sunday night, the fifth day of the annual Brahmotsavam of Sri Kodandarama Swamy Temple.

The festivities of vahana seva was conducted in ekantham inside the temple in view of Covid guidelines.

Garuda is not only a chariot but also a confidant, friend, pedestal and iconic flag of Mahavishnu. The utsava idols of Sri Kodandarama Swamy on the majestic vahana is a cynosure for all devotees. Garuda Seva is held in reverence in over 108 countries across the world.

Temple AEO Sri Muralidhar, Superintendent Sri Venkateshaiah, Temple Inspector Sri Dhananjeyulu and other staff were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గ‌రుడ‌ వాహనంపై శ్రీ కోదండ‌‌రాముడు

ఒంటిమిట్ట, 2021 ఏప్రిల్ 25: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో ‌రోజు ఆదివారం రాత్రి గ‌రుడ‌ వాహనంపై స్వామివారు సీతా, ల‌క్ష్మ‌ణ స‌మేతంగా క‌టాక్షించారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

గరుత్మంతుడు శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. దాసుడుగా, సఖుడుగా, విసనకఱ్ఱగా, చాందినిగా, ఆసనంగా, ఆవాసంగా, వాహనంగా ధ్వజంగా అనేక విధాల సేవలందిస్తున్న నిత్యసూరులలో అగ్రగణ్యుడైన వైనతేయుడు కోదండరామస్వామిని వహించి కదిలే తీరు సందర్శనీయమైనది. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూప‌రింటెండెంట్ శ్రీ వెంక‌టేశ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు‌ శ్రీ ధ‌నంజ‌యులు, శ్రీ గిరిబాబు, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.