KODANDARAMA CHILLS ON CHANDRA PRABHA VAHANA _ చంద్రప్రభ వాహనంపై కోదండరాముడి వైభవం

Tirupati, 19 Mar. 21:  On the seventh day of on-going annual brahmotsavam at Sri Kodandarama Swamy in Tirupati, Sri Rama graced on Chandra Prabha Vahana held in Ekantham in view of Covid guidelines.

Chandra or the moon stands for promoting medicinal values among living beings including plants. As per the scripts in the “Purushottam Praptiyagam” Chandra is described as Lord Vishnu who as an invisible architect, evolved solutions for all ills of the society. 

In other words, Chandra Prabha Vahanam signifies the role of the school of herbal and ayurvedic medicine.

Tirumala Pontiffs Sri Sri Sri Pedda Jeeyarswami and Sri Sri Sri Chinna Jeeyarswamy, special grade DyEO Smt Parvati, AEO Sri Durgaraju, Superintendent Sri Ramesh, Temple inspectors Sri Muniratnam, Sri Jayakumar and temple Archakas were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చంద్రప్రభ వాహనంపై కోదండరాముడి వైభవం

తిరుపతి, 2021 మార్చి 19: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శుక్ర‌వారం రాత్రి స్వామివారు చంద్ర‌ప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

చంద్రుడు భగవంతుని మారురూపమే. రసస్వరూపుడైన చంద్రుడు ఓషధులను పోషిస్తున్నాడు. ఆ ఓషధులు లేకపోతే జీవనం మనకు లేదు. కనుక ఓషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. ఆ చల్లని దేవరప్రభతో శ్రీ కోదండరామస్వామి దర్శనమిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.