KODANDARAMA RIDES ASWA VAHANA _ అశ్వ‌వాహ‌నంపై శ్రీకోదండరామస్వామి ద‌ర్శ‌నం

Vontimitta, 28, April 2021: Lord Kodandarama shined aloft Aswa vahana on the eighth day of the ongoing annual Sri Ramanavami Brahmotsavam of Vontimetta Sri Kodandarama Swamy temple held in ekantham on Wednesday night in view of Covid guidelines.

Upanishads describe all five elements of life as Horses and that almighty was their creator. With the ride on Horse, Sri Kodandarama indicated that his Darshan and sankeetans removed all Kali Doshas of devotees.

Temple AEO Sri Muralidhar, Superintendent Sri Venkateshaiah, Inspectors Sri Dhananjayulu, Sri Giribabu, archakas and other staff were present

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అశ్వ‌వాహ‌నంపై శ్రీకోదండరామస్వామి ద‌ర్శ‌నం

ఒంటిమిట్ట, 2021 ఏప్రిల్ 28: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవరోజు బుధ‌వారం రాత్రి అశ్వ‌వాహ‌నంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనం అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చి, తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తారు. తన నామ సంకీర్తనతో కలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూప‌రింటెండెంట్ శ్రీ వెంక‌టేశ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు‌ శ్రీ ధ‌నంజ‌యులు, శ్రీ గిరిబాబు, ఆల‌య అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.