డిసెంబరు 28న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

డిసెంబరు 28న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

డిసెంబరు 19, తిరుపతి, 2017: డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని డిసెంబరు 28వ తేదీ గురువారంనాడు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.

ఇందులోభాగంగా, ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయశుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గర్భాలయం, ఉప ఆలయాలను శుద్ధి చేస్తారు. ఆలయ సిబ్బంది అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి, 30న వైకుంఠ ద్వాదశి :

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి, డిసెంబరు 30న వైకుంఠ ద్వాదశి పర్వదినాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రెండు రోజుల పాటు ఉదయం తిరుప్పావై పారాయణం, ధనుర్మాస కైంకర్యాలు చేపడతారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.