డిసెంబరు21న ప్రకాశం, ఫిబ్రవరి 6న పశ్చిమగోదావరిలో శ్రీనివాసకల్యాణాలు

డిసెంబరు21న ప్రకాశం, ఫిబ్రవరి 6న పశ్చిమగోదావరిలో శ్రీనివాసకల్యాణాలు

డిసెంబరు 19, తిరుపతి, 2017: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో డిసెంబరు 21 తేదీన ప్రకాశం జిల్లా కారంచేడు మండలం తెమిడిత్తపాడు గ్రామంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది. అదేవిధంగా 2018, ఫిబ్రవరి 6న పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం కలవలపల్లి గ్రామంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు చేస్తాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.