KOIL ALWAR HELD _ శ్రీ వ‌కుళ మాత ఆల‌యంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

TIRUPATI, 22 JUNE 2022: In connection with Maha Samprokshanam on Thursday, Koil Alwar Tirumanjanam was performed at Sri Vakulamata temple in Patakalva on Wednesday.

Earlier in the morning Ratnadhivasam, Vimana Gopurakalasa Sthapana, Ratnanyasam, Dhatunyasam and other Vaidic rituals were performed.

MP Sri Mithun Reddy, TTD Board members Sri Ashok Kumar, Sri Ramulu, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, SVBC CEO Sri Suresh Kumar, CE Nageswara Rao, DyEO Sri Gunabhushan Reddy and other officials were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ వ‌కుళ మాత ఆల‌యంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

తిరుపతి, 2022 జూన్ 22: తిరుప‌తి స‌మీపంలోని పాత‌కాల్వ వ‌ద్ద ( పేరూరు బండ‌పై) టీటీడీ నిర్మించిన శ్రీ వ‌కుళ‌ మాత ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్యక్రమాల్లో భాగంగా బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వహించారు.

ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్ష‌ణ చేశారు.

అంత‌కుముందు ఉద‌యం 8 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు పుణ్యాహవ‌చ‌నం, ర‌త్నాధివాసం, విమాన గోపుర కలశ స్థాప‌న‌, ర‌త్న‌న్యాసం, ధాతు న్యాసం, విగ్రహ స్థాపన, అష్ట‌బంధ‌నం, యాగ‌శాల వైదిక కార్యక్ర‌మాలు నిర్వహించారు.

సాయంత్రం 5.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి అభిషేకం, రాత్రి 8 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు అగ్నిప్రణయనం, కుంభారాధ‌న, శ‌య‌నాధివాసం, స‌ర్వ‌దేవ‌తార్చ‌న‌, విశేష హోమాలు, యాగ‌శాలలో వైదిక‌ కార్య‌క్ర‌మాలు నిర్వహించనున్నారు.

అనంత‌రం జూన్ 23వ తేదీన ఆల‌య మ‌హా సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా జ‌రుగుతున్నఏర్పాట్ల‌ను ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి టీటీడీ అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించి, ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఈ కార్య‌క్రమంలో పార్ల‌మొంటు స‌భ్యులు శ్రీ మిథున్‌ రెడ్డి, టీటీడీ బోర్డు స‌భ్యులు శ్రీ పోక‌ల ఆశోక్ కుమార్‌, శ్రీ రాములు, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీరబ్రహ్మం, సివి ఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్వీబిసి సిఇవో శ్రీ సురేష్ కుమార్‌, సిఇ శ్రీ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈవో శ్రీ గుణభూషణ్‌రెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.