KOIL ALWAR HELD _ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

TIRUPATI, 16 JULY 2023: In connection with Anivara Asthanam on July 17, Koil Alwar Tirumanjanam was performed on Sunday at Sri Lakshmi Narayana temple at Alipiri.

Deputy EO Smt Shanti and other temple staff participated.

                                                   

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

 తిరుపతి, 16 జూలై 2023: అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద గల శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం వైభవంగా జరిగింది. జూలై 17వ తేదీ సోమవారం జరుగనున్న ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఇందులో భాగంగా పరిమళభరితమైన పచ్చ కర్పూరం, కిచిలీ గడ్డ, పసుపు, కుంకుమ, చందనం, సుగంధ ద్రవ్యాలతో కూడిన లేపనాన్ని ఆలయ గోడలకు ప్రోక్షణ చేశారు.


ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ ముని కృష్ణయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.