KOIL ALWAR IN KT_ ఫిబ్రవరి 23న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, 22 Feb. 19: Koil Alwar Tirumanjanam will be performed in Sri Kapileswara Swamy temple in connection with annual brahmotsavams on February 23.
The koil alwar tirumanjanam fete will be observed between 11.30am and 2.30p.m. The devotees will be allowed for darshanam between 8am and 11am and again from 2.30pm till closure of temple.
The brahmotsavams in this famous shrine of Lord Shiva will commence on February 25 and concludes on March 6.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఫిబ్రవరి 23న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2019 ఫిబ్రవరి 22: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 23వ తేదీ శనివారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయంలో ఫిబ్రవరి 25 నుండి మార్చి 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే.
ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారము, శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉదయం 8.00 నుండి 11.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.