PUJA PERFORMED TO TWIN BUILDINGS OF SRIVARI SEVA_ నూతన శ్రీవారిసేవ భవన సముదాయాల పూజలో పాల్గొన్న టిటిడి ఛైర్మన్
Tirumala, 22 Feb. 19: Puja was performed to the newly constructed twin buildings of Srivari Seva in Tirumala on Friday morning.
TTD Trust Board Chairman Sri P Sudhakar Yadav took part in this puja along with board member Sri Peddireddi.
Later speaking to media he said, Srivari Seva began with a noble purpose to facilitate services to countless devotees who come from all over India and overseas to Tirupati and Tirumala for glorious darshan of Lord Venkateswara in the year 2000.
Commenced with just 195 members today there are around 1500 sevaku lu on normal days and 3000-3500 during festivals like Brahmotsavams, Vaikunta Ekadasi etc.
”So far 10 Lakhs man hours were served in Srivari seva in the last 19 years.
Srivari Sevaks include NRIs and mostly devotees from Maharashtra, West Bengal, Jharkhand, Odisha,Chattisgarh, New Delhi besides southern states of AP, Telangana, Karnataka, Kerala and Puducherry”, he added.
Complimenting the engineering wing of TTD he said, two separate and state of art buildings have been got up on the Papa Vinashanam road behind the Kalyana Vedika for facilitating women and men Srivari Sevakulu respectively during their stay.
“Each complex has 16 halls with Ground plus two floors in two buildings, with a capacity to accommodate nearly 2000 persons each with 224 bath rooms, 278 toilets, Dining hall to feed 700 Sevaks at a tie ( buffet table). Apart from this recreation hall, satsang halls were also constructed to provide feel good ambience to the volunteers during their stay in Tirumala”, he maintained.
The Chairman said, the Honourable CM of AP Sri N Chandrababu Naidu has also complimented the srivari sevakulu during the Bhookarshana programme held at Amaravathi during last month, he recalled.
CE Sri Chandrasekhar Reddy, SE 2 Sri Ramachandra Reddy, EEs Sri Subramanyam, Sri Mallikarjuna Prasad, Sri Srihari, DE Smt Saraswathi, PRO Dr T Ravi were and others were also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
నూతన శ్రీవారిసేవ భవన సముదాయాల పూజలో పాల్గొన్న టిటిడి ఛైర్మన్
తిరుమల, 22 ఫిబ్రవరి 2019: తిరుమలలో నూతన శ్రీవారిసేవ భవన సముదాయాల్లో శుక్రవారం ఉదయం నిర్వహించిన పూజా కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీపుట్టా సుధాకర్ యాదవ్, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ ఇ.పెద్దిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ మొత్తం రూ.96 కోట్ల వ్యయంతో కల్యాణవేదిక వెనుక వైపు మహిళాసేవకుల కోసం సేవాసదనం-1, పురుష సేవకుల కోసం సేవాసదనం-2 భవనాలను ఆధునిక వసతులతో నిర్మించినట్టు తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న ఈ భవనాలపట్ల శ్రీవారి సేవకులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులకు సేవ చేసే అవకాశం తమకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఎక్కువ మంది శ్రీవారి సేవకులు వచ్చే అవకాశముందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక్కడ ఒక్కో భవనంలో 3 అంతస్తుల్లో 16 హాళ్లు ఉన్నాయని, దాదాపు 2 వేల మంది బస చేయవచ్చని వివరించారు. అదేవిధంగా, 224 స్నానపు గదులు, వేడినీటి సౌకర్యం, 278 మరుగుదొడ్లు, 700 మందికి భోజనశాల(బఫె సిస్టమ్), రిజిస్ట్రేషన్ హాలు, సత్సంగం హాలు, రిక్రియేషన్ హాలు, రెండు లిఫ్టులు, లాకర్లు, మంచాలు ఉన్నాయని తెలియజేశారు.
శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో 2000వ సంవత్సరంలో 195 మందితో శ్రీవారి సేవ అనే స్వచ్ఛంద సేవ ప్రారంభమైందని, ప్రస్తుతం ప్రతిరోజూ 1,500 మందికి తగ్గకుండా, పర్వదినాల్లో 3,000 నుండి 3,500 మంది వరకు శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారని ఛైర్మన్ వెల్లడించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇటీవల జరిగిన శ్రీవారి ఆలయ భూకర్షణ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో శ్రీవారి సేవకులు విచ్చేశారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు శ్రీవారి సేవకుల సేవలను అభినందించారన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి, డిఇ శ్రీమతి సరస్వతమ్మ, ఇఇలు శ్రీ సుబ్రమణ్యం, శ్రీమల్లికార్జునప్రసాద్, శ్రీ శ్రీహరి, సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, డెప్యూటీ ఇఇలు శ్రీ రాజశేఖర్, శ్రీ వెంకటరమణ, శ్రీమతి రమాదేవి, శ్రీవారి సేవ ఏఈవో శ్రీ పి.గోపాలరావు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.