KOIL ALWAR TIRUMANJANAM AT SRIVARI TEMPLE ON MARCH 24 _ శ్రీ‌వారి ఆల‌యంలో మార్చి 24న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala, 23 Mar. 20: Ahead of the Ugadi festival heralding the Telugu New Year Sri Sarvari Nama Samvatsaram, TTD is all set to perform the holy cleaning ritual of Koil Alwar Thirumanjanam at Srivari temple on March 24.

As a part of the same, Tirumanjanam ritual is performed from 6 am to 9am. The process of cleansing will be carried from Ananda Nilayam to Bangaru vakili with Parimalam, an aromatic mixture.

UGADI ASTHANAM ON MARCH 25

TTD is conducting the Ugadi Asthanam festival at Srivari Temple on March 25.

Sri Malayappasway and His consorts Sri Devi and Sri Bhudevi are brought inside temple in a pradakshina of Dwaja sthambham.

Later new silk vastrams are offered to Mula Virat and utsava idols Followed by Panchanga sravanam.

There after the Ugadi asthanam is conducted at the Bangaru Vakili by Agama pundits and archakas in a traditional manner. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి ఆల‌యంలో మార్చి 24న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల 2020 మార్చి 23: శ్రీ‌వారి ఆలయంలో మార్చి 25వ తేదీ తెలుగు సంవత్సారాది శ్రీ శార్వ‌రి నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆస్థానం నిర్వహించనుండడంతో మార్చి 24న‌ మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనుంది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ, ఉగాది, ఆణివార ఆస్థానం, హ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా  ఉదయం 6.00 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలంతో శుద్ధి కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది అత్యంత పవిత్ర కార్యక్రమంగా ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తారు.

మార్చి 25న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

శ్రీవారి ఆలయంలో మార్చి 25వ తేదీ బుధ‌వారం శ్రీ శార్వ‌రి నామ  సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా జ‌రుగ‌నుంది.

ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3.00 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6.00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7.00 నుండి 9.00 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు సిబ్బంది  పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.