DHWAJAROHANAM TO KRT BTUs PERFORMED _ ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Tirupati, 23 Mar. 20: The annual Brahmotsavam of TTD local temple of Sri Kodandarama Swamy commenced with the traditional Dwajarohanam event on Monday morning.

The sacred event was performed at Mesha Lagnam with special pujas to the Dwajasthambham by archakas.

PEDDASESHA VAHANAM

In the evening Pedda Sesha Vahanam was performed. 

Sri Sri Sri Pedda Jeeyar and Chinna Jeeyar Swamijis, DyEO Smt Shanti and other temple staffs were also present during Dhwajarohanam. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2020, మార్చి 23: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమ‌వారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక  బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 నుండి 9.30 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. కాగా, రాత్రి పెద్దశేష వాహన సేవ జ‌రుగ‌నుంది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి పాల్గొన్నారు.

ఆల‌య ప్రాంగ‌ణంలోనే బ్ర‌హ్మోత్స‌వ వాహ‌న‌సేవ‌లు

ఆలయంలో మార్చి 31వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఆల‌యంలో భ‌క్తుల ద‌ర్శ‌నాల‌ను తాత్కాలికంగా నిలుపుద‌ల చేశారు. అదేవిధంగా, బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ఉద‌యం, రాత్రి వాహ‌న‌సేవ‌ల‌ను మాడ వీధుల్లో ఊరేగింపును ర‌ద్దు చేశారు. ఈ వాహ‌న‌సేవ‌ల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే నిర్వ‌హిస్తారు. మార్చి 30న ర‌థోత్స‌వాన్ని, మార్చి 31న క‌పిల‌తీర్థంలో చ‌క్ర‌స్నానాన్ని ర‌ద్దు చేశారు.  

శ్రీ‌రామ‌న‌వ‌మి ఉత్స‌వాలు, తెప్పోత్స‌వాలు ర‌ద్దు

ఆల‌యంలో ఏప్రిల్ 2 నుండి 4వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న శ్రీ‌రామ‌న‌వ‌మి ఉత్స‌వాల‌ను, ఏప్రిల్ 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న తెప్పోత్స‌వాల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. ఏప్రిల్ 3న శ్రీ సీతారాముల క‌ల్యాణాన్ని ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.