KOIL ALWAR TIRUMANJANAM IN TIRUMALA _ జ‌న‌వ‌రి 11న‌ శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala, 10 January 2022: The traditional cleansing festival Koil Alwar Tirumanjanam will be performed in Tirumala temple on January 11 in connection with Vaikunta Ekadasi on January 13.

The cleaning activity will be held between 6am and 10am. The darshan for devotees will commence from 11am onwards on Tuesday.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జ‌న‌వ‌రి 11న‌ శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమ‌ల‌, 2022 జ‌న‌వ‌రి 10: తిరుమల శ్రీవారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 13న‌ వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకుని జ‌న‌వ‌రి 11న‌ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఈ సంద‌ర్భంగా ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హిస్తారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ప్రారంభ‌మ‌వుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.