GO ADHARITA AGRICULTURE TO PROTECT BOVINES-TTD _ గోసంర‌క్ష‌ణ కోస‌మే గో ఆధారిత వ్య‌వ‌సాయం

TTD REFUTES MISAPPROPRIATION IN THE DISTRIBUTION OF COWS 

 

Tirupati, 10 Jan. 22: With a noble aim to save cows, TTD has taken up Goadharita Vyavasayam and is carrying out a lot of cow-related programmes. As part of it, TTD has been distributing cows and oxen to farmers to promote Go Adharita farming.

 

This programme is going forward in a transparent manner and TTD has been distributing cows to only those farmers who are registered with AP Community Managed Natural Farming.

 

So far cows and oxen were distributed to such farmers only belonging to Rayalaseema districts, Nellore, Prakasam and Nagar Kurnool of Telangana state.           

 

When TTD is doing magnanimous activities to save and protect Gomata for future generations, it is so sad that some vested interests are trying to mislead the public by spreading rumours and alleging that TTD is distributing the bovines without passbooks.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గోసంర‌క్ష‌ణ కోస‌మే గో ఆధారిత వ్య‌వ‌సాయం

– ప‌ట్టాదారు పాసుపుస్త‌కాలు లేకుండా ఆవులు, ఎద్దులు పంపిణీ చేశామ‌న‌డం అవాస్త‌వం

తిరుప‌తి, 2022 జ‌న‌వ‌రి 10: గోసంర‌క్ష‌ణకు పెద్ద‌పీట వేస్తూ టిటిడి అనేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగానే గో ఆధారిత వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హిస్తూ ఈ త‌ర‌హా వ్య‌వ‌సాయం చేసే రైతుల‌కు ఉచితంగా ఆవు, ఎద్దుల‌ను అందిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రైతు సాధికార సంస్థ‌తో ఒప్పందం కుదుర్చుకుని వారు ధృవీక‌రించిన రైతుల‌కు మాత్ర‌మే ఆవు, ఎద్దుల‌ను అందించ‌డం జ‌రుగుతోంది. రాష్ట్రంలోని రాయ‌ల‌సీమ‌, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల‌తోపాటు తెలంగాణ‌లోని నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో రైతుల‌కు ఆవులు, ఎద్దుల‌ను పంపిణీ చేయ‌డం జ‌రిగింది.

ప‌ల‌మ‌నేరులోని దేశ‌వాళీ గో అభివృద్ధి సంస్థ స‌హ‌కారంతో ప‌ల‌మ‌నేరు, తిరుప‌తిలోని టిటిడి గోసంర‌క్ష‌ణ‌శాల‌ల్లో దేశ‌వాళీ ఆవుల సంత‌తిని పెంచ‌డానికి అనేక చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతోంది. వాస్త‌వాలు ఇలా ఉంటే ప‌ల‌మ‌నేరులో గోశాల నుంచి రైతులకు పంపిణీ చేస్తున్న ఆవు, ఎద్దుల‌ను కొంత‌మంది అడ్డుకోవ‌డం మంచిది కాదు. గోవులు క‌బేళాల‌కు వెళ్ల‌కుండా ఉండేందుకు ఈ కార్య‌క్ర‌మాన్ని టిటిడి నిర్వ‌హిస్తోంది. ప‌ట్టాదారు పాసుబుక్‌లు లేకుండా ఆవులు, ఎద్దులు పంపిణీ చేశామ‌న‌డం అవాస్త‌వం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.