KOIL ALWAR TIRUMANJANAM ON JULY 13 _ శ్రీవారి ఆలయంలో జూలై 13న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
TIRUMALA, 09 JULY 202:The traditional Temple cleansing fete Koil Alwar Tirumanjanam will be performed in Tirumala temple on July 13 in connection with Anivara Asthanam.
The entire premises of the temple will be cleaned with Parimalam, an aromatic mixture which will be smeared all over the walls, roofs of the temple that also acts as a disinfectant. This activity takes place from 6am to 11am.
Darshan to devotees follows after this traditional event on Tuesday.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి ఆలయంలో జూలై 13న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల, 2021 జూలై 09: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 16వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని జూలై 13న మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.