KRISDHRA SAGARA MATHANA CONCEPT VIBRATED PALLAKI UTSAVAM_ ప‌ల్ల‌కీ ఉత్స‌వంలో ఆక‌ట్టుకున్న “క్షీర‌సాగ‌ర మ‌ధ‌నం”

Tirumala, 14 October 2018: It was a spectacular showcase of mythology at the Lord Malayalappa’s Pallaki vahanam at mada street on Sunday. As part of the ongoing Srivari Navaratri Brahmotsavam.

The Kushiro sagara Mathanam episode from mythology staged by the 30 artists of the Hayagriva bhajana mandali of Guntur led Smt A Ramadevi earned rich applause from the devotees.

The artists donned roles of Devatas, demons, Mohini and displayed the incidents of Shiva drinking the Halahala (poison) and also dramatically pictured the birth of Kalpavruksha, Kamadhenu, Airavatam, Ashwam, Shankam, Kaustubham, Moon, Lakshmi Devi, and Amrutam.

They also choreographed the battle between Devatas and Demons for possession of Amrutam, arrival of Mahavishnu in Mohini avataram and feeding the Amrutam to devatas by bluffing the Demons.

The entire episode was spectacularly presented on the Mada streets in front of the Mohini avataram under the aegies of the Dasa Sahitya project and supervised by its OSD Sri Anandathirtha Charyulu.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ప‌ల్ల‌కీ ఉత్స‌వంలో ఆక‌ట్టుకున్న “క్షీర‌సాగ‌ర మ‌ధ‌నం”

అక్టోబర్ 14, తిరుమల 2018: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం జ‌రిగిన ప‌ల్ల‌కీ ఉత్స‌వంలో టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో క్షీర‌సాగ‌ర మ‌ధ‌నం ఘ‌ట్టం ప్ర‌ద‌ర్శ‌న ఆస‌క్తిక‌రంగా సాగింది. గుంటూరుకు చెందిన శ్రీ‌మ‌తి ఎ.ర‌మాదేవి నేతృత్వంలోని హ‌య‌గ్రీవ భ‌జ‌న మండ‌లికి చెందిన 30 మంది క‌ళాకారులు ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌ళ్ల‌కు క‌ట్టారు.

ఇందులోని క‌ళాకారులు దేవ‌త‌లు, రాక్ష‌సులు, మోహినీ, భ‌క్తుల వేషాల‌ను ధ‌రించారు. క్షీర‌సాగ‌ర మ‌ధ‌నంలో మొద‌ట ఉద్భ‌వించిన హాలాహలాన్ని(విషం) శివుడు తాగ‌డం, ఆ త‌రువాత వ‌రుస‌గా క‌ల్ప‌వృక్షం, కామ‌ధేనువు, ఐరావ‌తం, అశ్వం, శంఖం, కౌస్తుభం, చంద‌మామ‌, ల‌క్ష్మీదేవి, అమృతం ఉద్భ‌వించ‌డాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఆ త‌రువాత అమృతం కోసం దేవ‌త‌లు, రాక్ష‌సులు త‌ల‌ప‌డ‌డం, మోహినీ అవ‌తారంలో శ్రీ‌మ‌హావిష్ణువు రావ‌డం, రాక్ష‌సుల‌ను క‌వ్వించి అమృతాన్ని దేవ‌త‌ల‌కు అప్ప‌గించ‌డం వంటి దృశ్యాల‌ను బాగా పండించారు. టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనంద‌తీర్థాచార్యులు ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను ఏర్పాటుచేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.