MALAYAPPA MESMERISES DEVOTEES AS “MOHINI”_ మోహినీ అవతారంలో జగన్మోహనుడు
Tirumala, October 14 : On the pleasant morning of Sunday during the ongoing Srivari Navaratri Brahmotsavams, Sri Malayappa Swamy as Mohini mesmerised the pilgrims with His unparalleled Beauty and Charm.
The role of Mohini is resplendent with the mythological lore of Samudra Mathanam where Sri Maha Vishnu takes Mohini avatar to share the divine nectar between gods (Devatas) and demons (Asuras) to balance cosmic battle for supremacy. However, the Gods had an upper hand in procuring nectar while he demons were caught in the Maya of Celestial Beauty, Mohini.
While Mohini in all Her resplendent is carried out on an ivory palanquin accompanied by Sri Krishna Swamy on another carrier.
Through this unique Avatar, Lord sends a message to His devotees that they should not fall prey to worldly desires and come out of ‘Maya’ of the luxuries of world.
Every inch of all the 125 galleries have been occupied by pilgrims in the morning itself. Pilgrims are thrilled to witness the twin presence of Mohini and Lord Sri Krishna.
TTD Chairman Sri Putta Sudhakar Yadav, TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, Incharge CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh, VGOs Sri Raveendra Reddy, Smt Sadalakshmi, Temple Staff and devotees took part.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
మోహినీ అవతారంలో జగన్మోహనుడు
అక్టోబర్ 14, తిరుమల 2018: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన ఆదివారం ఉదయం శ్రీవారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చాడు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చాడు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, డ్రమ్స్ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ ఊరేగింపు అత్యంత రమణీయంగా జరిగింది.
ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు చాటి చెబుతున్నారు.
అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరుగనుంది. రాత్రి 7 నుంచి 12 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై శ్రీమలయప్పస్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.
ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ఆర్‌కె.సింగ్, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్, కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.యస్.శ్రీనివాసరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు డొక్కా జగన్నాథం, ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.