SHASRAKALASABHISHEKAM AND HANUMANTHA VAHANAM IN SRI KRT ON JAN 6_ జనవరి 5న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ

Tirupati, 24 Dec. 18: on January 5, Amavasya day, Sahasra Kalashabhisekam (morning 6-8am) and Hanumanta Vahanam will be grandly performed at the Sri Kodandarama Swamy Temple.

Interested couple could participate in the Sahasra Kalashabhishekam by payment of Rs 500 and get one uttarium, one laddu and vada as Prasadam.

In the evening between 7pm to 9pm, Hanumanta Vahanam will be conducted. As per Vaikhanasa Agama the Pournami, Amavasya, Shukla Ekadasi, Krishna Ekadasi, Sravanam, Punarvadu star days occupy special significance.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 5న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ

తిరుపతి, 2018 డిసెంబ‌రు 24: తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో జనవరి 5వ తేదీ అమావాస్యనాడు సహస్రకలశాభిషేకం, హనుమంత వాహనసేవ వైభవంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 6.00 నుండి 8.00 గంటల నడుమ సహస్ర కలశాభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.

సాయంత్రం 7.00 నుంచి రాత్రి 9.00 గంటల నడుమ హనుమంత వాహనసేవ జరుగనుంది. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రం తదితర పర్వదినాలకు చాలా విశిష్టత ఉంటుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.