ADHYANOTSAVAMS AT SRI GOVINDARAJA SWAMY TEMPLE ON JAN 6_ జనవరి 6 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

Tirupati, 25 Dec. 18: A 24-day festival of Adhyayanotsavams will commence at Sri Govindaraja Swamy Temple fron Jan 6 to 29.

As part of festivities of Magha madam, Divya Prabandam parayanam will be performed every day in the evening from 6-7 pm at the temple Kalyana mandapam where the utsava idols of Sri Devi, Sri Bhudevi, Sri Govindaraja Swamy, Senadhipati and Alwars will be placed.

As part of the Adhyayanotsavams Chinna Sattumora on January 16, Pranayama Kalahotsavam On January 22 and Pedda Sattumora will be performed in the temple.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 6 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

తిరుపతి, 2018 డిసెంబ‌రు 24: టిటిడి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 6 నుండి 29వ తేదీ వరకు 24 రోజుల పాటు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.

మాఘ మాసంలో ఆలయంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6.00 నుంచి 7.00 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. ఇందులో భాగంగా జనవరి 16న చిన్నశాత్తుమొర, జ‌న‌వరి 22న ప్రణయ కలహోత్సవం, జ‌న‌వరి 26న పెద్ద శాత్తుమొర నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.