KOIL ALWAR TIRUMANJANAM PERFORMED_ తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 2 November 2018: The temple cleaning fete, koil alwar tirumanjanam was performed in Sri Kodanda Rama Swamy temple in Tirupati on Friday in connection with Deepavali Asthanam on November 7.

The sarva darshanam commenced after the fete at 9.30am.

Meanwhile Asthanam and Sahasra Kalasabhishekam will be observed in the temple on November 7.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2018, నవంబరు 02: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో నవంబరు 7వ తేదీ దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6.00 నుండి 9.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధద్రవ్యాన్ని గర్భాలయ గోడలకు పూశారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ ఇ.సి.శ్రీధర్‌, ఏఈవో శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

నవంబర్‌ 7న దీపావళి ఆస్థానం, సహస్ర కలశాభిషేకం

శ్రీకోదండరామాలయంలో నవంబర్‌ 7వ తేదీ అమావాస్య, దీపావళి సందర్భంగా సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు ఆస్థానం నిర్వహించనున్నారు. అమావాస్య సందర్భంగా ఉదయం 6.00 నుండి 9.00 గంటల నడుమ సహస్ర కలశాభిషేకంసేవ వైభవంగా జరగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.

దీపావళి సందర్భంగా నవంబర్‌ 7వ తేదీ రాత్రి 7.00 గంటలకు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమావాస్యనాడు ఆలయంలో నిర్వహించే హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.