TELECAST VISHNU SAHASRA NAMAM IN SVBC IN EVENINGS ALSO_ మరింత పారదర్శకంగా ఆర్జిత సేవల బుకింగ్‌ విధానం : ‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 2 November 2018: While appreciating the devotional programmes that are being relayed by Sri Venkateswara Bhakti Channel of TTD, a pilgrim sought TTD EO Sri Anil Kumar Singhal to telecast Vishnu Shasra Namam during evening times also.

The monthly Dial your EO programme took place at Annamaiah Bhavan in Tirumala on Friday where in as many as 25 pilgrim callers had given some suggestions and brought some issues to the notice of TTD EO. Reacting to the suggestion of pilgrim caller Sri Ramaiah from Bengaluru, the EO said, it is a pleasure to see that the SVBC programmes are reaching global pilgrims. At present we are relaying Vishnu Sahasra Namam in the morning slot onlywe have to give priority to other religious programmes, he added.

Sri Ramachandra Reddy from Kadapa, Sri Ramu from Eluru, have sought EO to ensure Seva tickets in online to which EO replied, for more transparency we have now introduced only one registration on one mail ID and one mobile number from this month onwards. We will examine this for a few months and based on the feedback we will make further pilgrim friendly amendments, he said.

A pilgrim caller Sri Srinivas from Greenfield said, whether it is possible to book for 100 members in online for the month of March 2019. Answering the caller, EO said, on December 2 the Rs.300 tickets quota will be released online and they can comfortably book for all.

Responding to a caller Sri Rama Sharma from Bengaluru, the EO said, it is not feasible for TTD to arrange a shopping mall to sell the photos of deities and other spiritual objects. He also the rates on the objects that are being sold by the shopping malls in Tirumala could not be fixed by TTD.

Another caller Sri Mohan Raju from Piler suggested EO to arrange escalator inside Garbhalaya to avoid jostling and enhance lighting as the presiding deity is not visible to many in Maha Laghu darshanam to which EO replied it is not possible in religious angle as per the tenets of Agama shastras.

JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar, CE Sri Chandrasekhar Reddy, CVSO (FAC) Sri Sivakumar Reddy and other senior officers were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మరింత పారదర్శకంగా ఆర్జిత సేవల బుకింగ్‌ విధానం : ‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుమల, 02 నవంబర్‌ 2018: శ్రీవారి ఆర్జిత సేవల బుకింగ్‌ విధానాన్ని మరింత పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు ఒక ఫోన్‌ నంబర్‌ లేదా ఒక ఈ-మెయిల్‌ ఐడితో ఒకరే నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలిచ్చారు.

ఈ సందర్భంగా 2019, ఫిబ్రవరి నెల కోటాలో మొత్తం 67,146 టికెట్లను ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 9,796 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 7,096, తోమాల 110, అర్చన 110, అష్టదళపాదపద్మారాధన 180, నిజపాదదర్శనం 2300 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో 57,350 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 2,000, కల్యాణం 12,825, ఊంజల్‌సేవ 4,050, ఆర్జితబ్రహ్మూెత్సవం 7,425, వసంతోత్సవం 14,850, సహస్రదీపాలంకారసేవ 16,200 టికెట్లు ఉన్నాయని వివరించారు.

1. రాము – ఏలూరు, రామచంద్రారెడ్డి – కడప

ప్రశ్న: ఆన్‌లైన్‌ డిప్‌లో ప్రయత్నిస్తుంటే సేవా టికెట్లు లభించడంలేదు?

ఈవో : నెలకు దాదాపు లక్ష మంది భక్తులు ఆర్జిత సేవల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటున్నారు. సేవా టికెట్లు పరిమితంగా ఉండటంతో అందరికి లభ్యమయ్యే పరిస్థితి లేదు. ప్రయత్నిస్తూ ఉండాలి. తిరుమలలోను ఎలక్ట్రానిక్‌ డిప్‌ ద్వారా ఆర్జిత సేవలను కేటాయిస్తున్నాం.

2. లలిత – తమిళనాడు.

ప్రశ్న: సర్వదర్శనంలో వృద్ధులు ఎక్కువ దూరం నడవాల్సి వస్తోంది ?

ఈవో : వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్‌ ద్వారా సులువుగా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం.

3. కరుణాకర్‌ రెడ్డి – కర్నూలు.

ప్రశ్న: నడకమార్గంలో మొదటి గోపురం సమీపాన తలఏరు గుండు వద్ద గ్రిల్స్‌ తొలగించండి?

ఈవో : ఆ ప్రాంతాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

4. శ్రీనివాస్‌ – విజయవాడ.

ప్రశ్న: వైకుంఠ ద్వాదశికి రూ.300/- టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు ?

ఈవో : భక్తులకు ముందుగా తెలియజేసి ఆన్‌లైన్‌లో విడుదల చేస్తాం.

5. నాగరాజు – శంకర్‌పల్లి, సంగారెడ్డి, శివసాయి – నెల్లూరు, శంకర్‌ – మిర్యాలగూడ

ప్రశ్న: కల్యాణోత్సనానికి దంపతులతో పాటు పిల్లలను, తల్లిదండ్రులను తీసుకురావచ్చా ?

ఈవో : ఎక్కువ మంది భక్తుల సౌకర్యార్థం ఇద్దరిని మాత్రమే అనుమతిస్తాం. కల్యాణోత్సవంలో సామూహికంగానే సంకల్పం చెప్పించేందుకు వీలుంది.

6. రామోహ్మన్‌ శర్మ – బెంగుళూరు.

ప్రశ్న: పౌర్ణమి గరుడసేవ రోజున మాడ వీధిలో నిలబడివుండగా సెక్యూరిటీ సిబ్బంది తోసేశారు ?

ఈవో : సెక్యూరిటి సిబ్బందికి తగిన సూచనలు ఇస్తాం. భక్తులు గ్యాలరీల నుండి సౌకర్యవంతంగా స్వామి వారిని దర్శించుకోవచ్చు.

7. శివరామ్‌ – హైదరాబాద్‌.

ప్రశ్న: వృద్ధుల కోసం శ్రీవారి ఆలయం నుండి బస చేసిన గదుల వరకు బ్యాటరీ కార్లు పెట్టండి?

ఈవో : రాంబగీచా వద్ద బ్యాటరీ కార్లు అందుబాటులో ఉన్నాయి.

8. సూర్యనారాయణ – శ్రీకాకుళం.

ప్రశ్న: నూతన సంవత్సరానికి ఆన్‌లైన్‌లో దర్శనం, గదుల బుకింగ్‌ సౌకర్యం ఉందా ?

ఈవో : పర్వదినాల సమయంలో పరిమితంగా ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు, గదులు అందుబాటులో ఉంచుతాం.

9. అనంతరామ్‌ – బెంగుళూరు, రామచంద్రప్ప – బెంగళూరు, మోహన్‌రాజ్‌ – పీలేరు.

ప్రశ్న: క్యూలైన్లలో భక్తుల తోపులాటను అరికట్టండి? స్వామివారు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయండి?.

ఈవో : విజిలెన్స్‌ సిబ్బంది సాయంతో భక్తుల తోపులాటను తగ్గిస్తున్నాం. భక్తులు ఎవరికివారు సంయమనం పాటిస్తే ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఆగమాల ప్రకారం లైటింగ్‌ పెంచడం సాధ్యం కాదు. నాద నీరాజనం వేదికపై జానపద సంగీతం ప్రదర్శనలు ఏర్పాటు చేసే విషయంపై చర్చిస్తాం.

10. సుబ్రమణ్యం – చెన్నై, రామయ్య – నెల్లూరు.

ప్రశ్న: ఎస్వీబీసీలో షష్టిపూర్తి కార్యక్రమాన్ని తిరిగి ప్రసారం చేయండి, విష్ణుసహస్రనామాన్ని సాయంత్రం కూడా ప్రసారం చేయండి?

ఈవో : ఎస్వీబీసీ బోర్డులో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం. ధర్మోరక్షతి రక్షిత: స్టిక్కర్లను తిరిగి ముద్రిస్తాం.

11. కిరణ్‌ -నెల్లూరు

ప్రశ్న: లక్కీడిప్‌లో ఆర్జితసేవా టికెట్ల నమోదుకు ఫొటో తప్పనిసరి చేయండి?

ఈవో : ఎక్కువ మంది భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్ణయం తీసుకుంటాం.

12. అయ్యన్న – రాజమండ్రి

ప్రశ్న: ఈ-దర్శన్‌ కౌంటర్‌లో ఆర్జిత సేవా టికెట్లు బుక్‌ చేయడం లేదు?

ఈవో : ఈ-దర్శన్‌ కౌంటర్లలో ఆర్జిత సేవా టికెట్లకు ఎలాంటి ప్రత్యేక కోటా లేదు. ఇంటర్నెట్‌ వసతి ఉంటే ఎక్కడైనా వీటిని బుక్‌ చేసుకోవచ్చు.

13. కామేశ్వర్‌ రావు – హైదరాబాద్‌

ప్రశ్న: చక్రస్నానం సమయంలో అర్చకులు సుదర్శన చక్రం కంటే ముందుగానే మునుగుతున్నారు. కల్యాణం టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి గదులు ఇవ్వండి, లడ్డూలు ట్రేలు శుభ్రం చేసే చోట వ్యర్థాలను తొలగించండి?

ఈవో : వైదిక కార్యక్రమాలు అర్చకుల ఆధ్వర్యంలోనే జరుగుతాయి. వారికి ఈ విషయాన్ని తెలియజేస్తాం. తిరుమలలో గదులు పరిమితంగా ఉన్న కారణంగా ఇవ్వడం సాధ్యం కాదు. వ్యర్థాలను తొలగిస్తాం.

14. రమేష్‌ – హైదరాబాద్‌, సంజయ్‌ – హైదరాబాద్‌

ప్రశ్న: సిఫారసు లేఖలు తీసుకువస్తున్న భక్తులతో జెఈవో కార్యాలయం సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు?

ఈవో : గదుల కోసం సిఫారసు లేఖలు తీసుకువచ్చే భక్తులు నిర్దేశించిన కౌంటర్లలో సమర్పించాలి. ఎన్నికల కోడ్‌ ఉన్న సమయంలో సిఫారసు లేఖలు స్వీకరించడం సాధ్యం కాదు. సిబ్బంది దురుసుగా ప్రవర్తించకుండా తగిన సూచనలు ఇస్తాం.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, శ్వేత సంచాలకులు శ్రీఎన్‌.ముక్తేశ్వరరావు, ఇన్‌చార్జి సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విఎస్‌వో శ్రీ ఎం.మనోహర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.