KRT BTUs FROM MARCH 30 TO APRIL 7 _ మార్చి 30 నుండి ఏప్రిల్ 7వ తేదీ వ‌ర‌కు తిరుప‌తిలోని శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు : టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

TIRUPATI, 30 MARCH 2022: The annual Brahmotsavams in Sri Kodanda Rama Swamy temple in Tirupati will be observed between March 30 till April 7, said TTD JEO Sri Veerabrahmam.

Reviewing on the arrangements to be made for the big festival which is taking place after two years due to Covid Pandemic, in the meeting hall of TTD Administrative Building in Tirupati on Friday the JEO asked the officials concerned to make grand arrangements.

He directed the officials concerned that devotion music, Harikatha shall be arranged at Sri Ramachandra Pushkarini and Veda Parayanam during Unjal Seva while Brahmotsavams are underway.

He also discussed on floral, electrical decorations, sanitation, and security aspects with officials concerned.

Koil Alwar Tirumanjanam will be observed on March 27 while Ankurarpana on March 29 and Dhwajarohanam on March 30. The Garuda Vahanam takes place on April 3 while Sri Rama Navami Utsavams from April 10-12 and Teppotsavams from April 14-16.

Special Grade DyEO Smt Parvati, SEs Sri Satyanarayana, Sri Venkateswarulu, GM Transport Sri Sesha Reddy, DyEOs Sri Govindarajan, Sri Lakshman Naik, VGO Sri Manohar, Additional HO Dr Sunil Kumar were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 30 నుండి ఏప్రిల్ 7వ తేదీ వ‌ర‌కు తిరుప‌తిలోని శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు : టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

తిరుపతి, 2022 మార్చి 11: తిరుప‌తిలోని శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాలు మార్చి 30 నుండి ఏప్రిల్ 7వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయ‌ని టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై శుక్ర‌వారం తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో వివిధ విభాగాల అధికారుల‌తో జెఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌ల ఊరేగింపు ఉంటుంద‌ని, ట్రాఫిక్‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని కోరారు. రథోత్స‌వం నాడు విద్యుత్ లైన్ల వ‌ల్ల ఇబ్బందులు లేకుండా ఎస్‌పిడిసిఎల్ అధికారుల‌తో చ‌ర్చించి ముంద‌స్తు ఏర్పాట్లు చేయాల‌న్నారు. ర‌థం ఫిట్‌నెస్‌ను ప‌రిశీలించి స‌ర్టిఫికేట్ పొందాల‌న్నారు. మెరుగైన పారిశుద్ధ్య చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అద‌న‌పు ఆరోగ్య శాఖాధికారికి సూచించారు. త‌గినంత మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను ఆహ్వానించాల‌ని, మేళం సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల‌ని ఆదేశించారు. రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద సంగీత కార్య‌క్ర‌మాలు, హ‌రిక‌థ ఏర్పాటు చేయాల‌ని, ఊంజ‌ల్ సేవ‌లో వేద‌పారాయ‌ణం జ‌రిగేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. అన్న‌ప్ర‌సాదాలు విత‌ర‌ణ చేయాల‌ని, వేద‌పారాయ‌ణదారులు, పోటు కార్మికులు త‌గినంత మందిని డెప్యుటేష‌న్‌పై తీసుకోవాల‌ని ఆల‌య అధికారుల‌కు సూచించారు.

కాగా, ఆల‌యంలో మార్చి 27న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, మార్చి 29న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌, ఏప్రిల్ 2న ఉగాది ఆస్థానం, ఏప్రిల్ 9న 2వ వసంతోత్స‌వం, ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వ‌ర‌కు శ్రీ‌రామ‌న‌వ‌మి ఉత్స‌వాలు, ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వ‌ర‌కు తెప్పోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

30-03-2022(బుధ‌) ధ్వజారోహణం(మేష ల‌గ్నం) పెద్దశేష వాహనం

31-03-2022(గురు) చిన్నశేష వాహనం హంస వాహనం

01-04-2022(శుక్ర‌) సింహ వాహనం ఉగాది ఆస్థానం/ముత్యపుపందిరి వాహనం.

02-04-2022(శ‌ని) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

03-04-2022(ఆది) పల్లకీ ఉత్సవం గరుడ వాహనం

04-04-2022(సోమ‌) హనుమంత వాహనం వసంతోత్సవం/గజ వాహనం

05-04-2022(మంగ‌ళ‌) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

06-04-2022(బుధ‌) రథోత్సవం అశ్వవాహనం

07-04-2022(గురు) చక్రస్నానం ధ్వజావరోహణం

ఈ స‌మావేశంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి పార్వ‌తి, ఎస్ఇలు శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవింద‌రాజ‌న్‌, శ్రీ ల‌క్ష్మ‌ణ్ నాయ‌క్‌, విజివో శ్రీ మ‌నోహ‌ర్, అద‌న‌పు ఆరోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ సునీల్ కుమార్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.