MAHA SAMPROKSHANA OF VIZAG SRIVARI TEMPLE FROM MARCH 18-23-TTD JEO _ మార్చి 18 నుండి 23వ తేదీ వరకు విశాఖలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ : టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం
Tirupati, 11 March 2022: TTD JEO Sri Veerabrahmam said on Friday that the Maha Samprokshana fete will be performed at Sri Venkateswara temple, Visakhapatnam from March 18-23.
Addressing a review meeting with officials of all TTD wings at the conference hall of the TTD Administrative Building on Friday, the TTD JEO directed that a few TTD employees should be sent on deputation to Visakhapatnam for conducting the programs.
Among others he instructed officials to complete electricity, Public Address System, Annaprasadam, beautification and greenery, footwear counters, non-stop power supply and SVBC telecasting.
Similarly he instructed officials to organise electrical and flower decorations, temporary toilets, separate counters for sale of TTD products like agarbattis, photo frames and Panchagavya products, sign boards, flexes, display screens for devotees benefit.
The JEO also reviewed on preparations for the ensuing annual Brahmotsavam at Vontimetta Sri Kodandarama Swamy temple in YSR Kadapa district from April 10-18.
TTD SEs Sri Venkateshwarlu, Sri Satyanarayana, Transport GM Sri Sesha Reddy, DyEOs Sri Govindarajan, Sri Lakman Nayak, VGO Sri Manohar and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మార్చి 18 నుండి 23వ తేదీ వరకు విశాఖలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ : టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం
తిరుపతి, 2022 మార్చి 11: విశాఖపట్నంలో నిర్మాణం పూర్తయిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు మార్చి 18 నుండి 23వ తేదీ వరకు నిర్వహించనున్నామని టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. మహాసంప్రోక్షణ ఏర్పాట్లపై శుక్రవారం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో వివిధ విభాగాల అధికారులతో జెఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ఆలయ, పరిపాలన సిబ్బంది తగినంత మందిని డెప్యుటేషన్‌పై పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, విద్యుత్ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అన్నప్రసాదాల పంపిణీ సజావుగా జరిగేలా చూడాలన్నారు. అటవీ, ఉద్యానవన విభాగాల ఆధ్వర్యంలో సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. భక్తుల కోసం పాదరక్షలు భద్రపరుచుకునే కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమాలను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సర్వాంగ సుందరంగా విద్యుత్ అలంకరణ పనులు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అగరబత్తీలు, ఫొటోఫ్రేమ్‌లు, పంచగవ్య ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయం వద్ద గల ధ్యానమందిరంలో శబ్దం రాకుండా ప్రశాంతంగా ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయం వద్ద సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలు, భక్తులు తిలకించేందుకు డిస్‌ప్లే స్క్రీన్లు అమర్చాలని ఆదేశించారు.
అనంతరం ఏప్రిల్ 10 నుండి 18వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జరుగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవో అధికారులతో సమీక్షించారు.
ఈ సమావేశంలో ఎస్ఇలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ సత్యనారాయణ, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శ్రీ లక్ష్మణ్ నాయక్, విజివో శ్రీ మనోహర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.