KUMARADHARA THEERTHA MUKKOTI HELD _ తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి

TIRUMALA, 07 MARCH 2023: Kumaradhara Theertha Mukkoti was held in Tirumala on Tuesday.

 

Scores of devotees trekked the torrent and TTD distributed Annaprasadam and water to the devotees at Kumaradhara Dam point. Security arrangements have also been made for the safety of devotees.

 
 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి
 
తిరుమల, 2023 మార్చి 07: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి వాయవ్యదిశలో వెలసివున్న శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి మంగ‌ళ‌వారం ఘనంగా జరిగింది.
 
ఈ సందర్భంగా కుమారధార తీర్థ ముక్కోటికి వచ్చేసే భక్తులకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేసింది ఇందులో భాగంగా తీర్థానికి విచ్చేసిన భక్తులకు శ్రీవారి సేవకుల సహకారంతో ఉదయం అల్పాహారము, పాలు, మధ్యాహ్నం సాంబారు అన్నం, మజ్జిగ అన్నం, పులిహోర, మజ్జిగ, సాయంత్రం ఉప్మా, కిచిడి, తాగునీరు  అందించారు. టిటిడి విజిలెన్స్, పోలీస్, అటవీ విభాగాలు సమన్వయంతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో అదనప సిబ్బందిని ఏర్పాటు చేసి వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించారు.
 
ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్థముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం భక్తులు ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు.
 
ప్రాశస్త్యం
 
వరాహ, మార్కండేయ పురాణాల ప్రాకారం ఒక వృద్ద బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు.శ్రీ వేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై ”ఈ వయస్సులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏంచేస్తున్నావు” అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి ‘కుమర ధార’ అనే పేరు వచ్చింది.
 
పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోకం సేనాధిపతి కుమారస్వామి రాక్షసుడైన తారకాసురిడి సంహారం తరువాత శాపవిమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచన మేరకు శేషాచల పర్వాతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థ్లంలో స్నానమాచరించి శాపవిమోచనం పొందడు. సాక్షత్తు కుమారస్వామివారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి ‘కుమారధార’ అనే పేరు స్థిరపడింది.  
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.