TEPPOTSAVAM CONCLUDES _ ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు

TIRUMALA, 07 MARCH 2023: The annual Teppotsavams of Tirumala concluded on a grand religious note on Tuesday.

 

Under the sheath of full moonlight, Sri Malayappa along with Sridevi and Bhudevi took out seven celestial rounds on the finely decorated Teppa all along the sacred waters of Swamy Pushkarini to bless the devotees.

 

HH Sri Pedda Jeeyangar and HH Sri Chinna Jeeyangar of Tirumala, TTD EO Sri AV Dharma Reddy, Board members Sri Maruti Prasad, Sri Dasari Kiran, EE Sri Jaganmohan Reddy, DyEO Sri Ramesh Babu, Psishkar Sri Srihari, VGO Sri Bali Reddy and others were present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు

తిరుమల, 2023 మార్చి 07: తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తె‌ప్ప‌పై విహ‌రించి భక్తులకు కనువిందు చేశారు.

ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను క‌టాక్షించారు. మంగళవాయిద్యాలు‌, వేదపండితుల వేదపారాయ‌ణం, అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్ర‌ప‌ర్వంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, డెప్యూటీ ఈఓ శ్రీ రమేష్ బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.