LAKHS WITNESS RADHASAPTHAMI _ రథసప్తమి ఏర్పాట్లపై భక్తులు హర్షం

DEVOTEES GIVES A BIG THUMBS UP TO THE ARRANGEMENTS BY TTD FOR RADHASAPTHAMI

CHAIRMAN ATTRIBUTES SUCCESS TO TEAM WORK OF STAFF, POLICE, SECURITY AND SEVAKS

TIRUMALA, 04 FEBRUARY 2025: Lakhs of devotees converged to witness the grandeur of Sri Malayappa Swamy on Saptha Vahanams from dawn to dusk in connection with Radhasapthami at Tirumala.

The devotees who occupied all the galleries since the wee hours of Tuesday, complimented the TTD for pilgrim-friendly arrangements including continuous provision of Annaprasadam, drinking water, beverages, Sundal, biscuits and above all the German sheds which provided them shade and protection from inclement weather conditions. 

After the Kalpavriksha Vahanam, TTD Chairman Sri BR Naidu along with a few board members,  EO Sri J Syamala Rao, Additional EO Sri Ch Venkaiah Chowdary, JEO Sri Veerabrahmam, CVSO Incharge Sri Manikantha personally inspected the galleries and interacted with the devotees to receive their feedback. 

Terming the facilities as “Never Before” , the devotees unanimously lauded the services of TTD. 

Chintamani from Madhurai, Chennammal from Ranipet, Devaki from Coimbatore, Basavanna from Mulabagul of Karnataka, Anuj from Mumbai besides Sulochana from Vizag, Vijalakshmi from Nellore, Vijaya from Tirupati all hailed TTD for providing the devotees with variety of Annaprasadams starting from morning till the completion of Vahanams in the evening. 

The sanitation and cleanliness received a huge applause from devotees besides security measures. The toilets are perfectly maintained. Hats off to the services of Srivari Sevaks who have been rendering services in the galleries from 4am till the completion of all the vahanams, the devotees complimented.

The devotees also praised the medical services provided to devotees in mobile battery cars.

On the other hand the Chairman attributed the stupendous success to the planned and co-ordinated teamwork of TTD, Vigilance and Security, Police, Srivari Sevaks. He said with this inspiration they would make much better arrangements in the future keeping in view the larger benefit of devotees.

Among the board members, Smt Panabaka Laksmi, Sri Santaram, Sri Sada Siva Rao were also present.

Additional EO Sri Ch Venkaiah Chowdary, JEO Sri Veerabrahmam, CVSO Sri Manikantha and other officers were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రథసప్తమి ఏర్పాట్లపై భక్తులు హర్షం

తిరుమల 2025, ఫిబ్రవరి 04: టిటిడి అధికారులు, సిబ్బంది, పోలీసులు, జిల్లా యంత్రాంగం సేవలు, శ్రీవారి సేవకుల సేవలను కొనియాడిన ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు

తిరుమలలో రథసప్తమి సందర్భంగా మంగళవారం సాయంత్రం కల్పవృక్ష వాహనం అనంతరం మాడ వీధుల్లో టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, పలువురు పాలకమండలి సభ్యులు, టిటిడి ఈవో శ్రీ జె శ్యామల రావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం ల ముందు భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు మాట్లాడుతూ నాలుగు మాడ వీధుల్లో భక్తులు సౌకర్యార్థం
టిటిడి అధికారులు, సిబ్బంది, పోలీసులు, జిల్లా యంత్రాంగం, శ్రీవారి సేవకులు విశేషంగా సేవలు అందించారన్నారు. వందకు వంద శాతం అద్భుతంగా సౌకర్యాలు కల్పించారని, ఇదే పద్దతిలో వచ్చే సంవత్సరం కూడా అందించాలని భక్తులు కోరారన్నారు. అందుకు తగ్గట్టుగా భక్తులు సంతృప్తి చెందేలా సౌకర్యాలు కల్పిస్తామని ఛైర్మన్ తెలిపారు.

అంతకుముందు టిటిడి యంత్రాంగం సమిష్టిగా సౌకర్యాలను అందించారని భక్తులు కొనియాడారు. చెన్నై, బెంగళూరు, కొయంబత్తూరు, కంచి, హైదరాబాద్ , అనకాపల్లి, నెల్లూరు , విజయవాడ, అనంతపురం , కర్నూలు, బళ్ళారి తదితర ప్రాంతాల వచ్చిన భక్తులు టిటిడి ఛైర్మన్, టిటిడి ఈవో, అదనపు ఈవో లను వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు భక్తులు తమకు అందిన సౌకర్యాలపై ఆనందం వ్యక్తం చేశారు. గ్యాలరీలలోకి అన్నప్రసాదాలు , తాగునీరు, పాలు, మజ్జిగ, బాదం పాలు, శెనగలు క్రమం తప్పకుండా అందాయన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించారన్నారు. మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచారని తెలిపారు. శ్రీవారి సేవకులు అవిశ్రాంతంగా సేవలు అందించారని టిటిడి ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో ముందు భక్తులు అభినందనలు తెలిపారు.

నాలుగు మాడ వీధుల్లో వాహన సేవల్లో శ్రీ మలయప్ప స్వామి వారిని ప్రశాంతంగా దర్శించుకున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు పాలకమండలి సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ శాంతా రామ్, శ్రీ సదాశివ రావు, టిటిడి జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ మణికంఠ చందోలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.