LAKSHMI KASULA HARAM SHOBH YATRA _ ల‌క్ష్మీ కాసుల హారం శోభాయాత్ర

Tirumala, 01 December 2024: As a part of the ongoing annual Karthika Brahmotsavams of Tiruchanoor, the Lakshmi Kasula Haram will be taken on a procession on Monday morning from Tirumala to Tiruchanoor.

The Kasula Mala will be decorated to Sri Padmavati Devi during Gaja Vahana Seva to be held on Monday evening.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ల‌క్ష్మీ కాసుల హారం శోభాయాత్ర

తిరుమల, 2024 డిసెంబరు 01: తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా సోమ‌వారం జ‌రుగ‌నున్న గ‌జ‌వాహ‌న‌సేవ‌లో అలంక‌రించేందుకు తిరుమ‌ల శ్రీ‌వారి ల‌క్ష్మీకాసుల హారాన్ని సోమ‌వారం ఉద‌యం శోభాయాత్రగా తిరుచానూరుకు తీసుకెళ్ల‌నున్నారు.

ముందుగా తిరుమ‌లలో శ్రీవారి ఆల‌యం నుండి ఈ హారాన్ని ఆల‌య నాలుగు మాడ‌వీధుల్లో శోభాయాత్ర నిర్వహించి తిరుచానూరుకు తీసుకొస్తారు.

తిరుచానూరులోని పసుపు మండపం వ‌ద్ద‌ హారానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ ఊరేగింపుగా ఆల‌యం వద్దకు తీసుకెళ్తారు. ఆల‌య ప్రాంగ‌ణంలో ప్ర‌ద‌క్షిణ‌గా గ‌ర్భాల‌యంలోకి తీసుకెళ్లి మూలమూర్తికి ల‌క్ష్మీ కాసుల హారాన్ని అలంకరిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.