LANKAN PM OFFERS PRAYERS IN TRUMALA TEMPLE_ శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని గౌ|| శ్రీ రనీల్‌ విక్రమసింఘే తులాభారం మొక్కు చెల్లింపు

THE FOREIGN DIGNITARY OFFERS TULABHARAM

Tirumala, 3 March 2019: The Prime Minister of Srilakshmi Sri Ranil Wikramasinghe offered prayers in temple of Lord Venkateswara at Tirumala during Suprabhata Seva.

The foreign dignitary along with his spouse Smt Maitree Wikramasinghe offered prayers in this pre-dawn ritual at 3am.

TTD Executive Officer Sri Anil Kumar Singhal and Tirumala JEO Sri KS Sreenivasa Raju welcomed the dignity at Mahadwaram and accompanied them during darshan.

LANKAN PM OFFERS TULABHARAM

Before having darshan of Lord Venkateswara, the Prime Minister of Sri Lanka offered Tulabharam equal to his weight.

Tulabharam is an age old tradition in Tirumala where a devotee wishes to offer sugar, rice, jaggery or amount equivalent to the weight of his or her body.

The Sri Lankan PM offered Rs.16,160, the amount equalling to his body weight with each kilo costing Rs.202 in Rupee one of Indian currency.

VEDIC PUNDITS OFFER ASIRVACHANAM TO THE LANKAN PM

Later the Lankan PM was offered Vedasirvachanam at Ranganayakula Mandapam by the vedic pundits.

He was later presented with silk rastram, Theertha Prasadams and laminated photo of Lord Venkateswara by TTD EO and Tirumala JEO.

CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Haridranath, Reception DyEO Sri Balaji and Other temple officials of TTD were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని గౌ|| శ్రీ రనీల్‌ విక్రమసింఘే తులాభారం మొక్కు చెల్లింపు

తిరుమల 2019 మార్చి 03: శ్రీలంక ప్రధాన మంత్రి గౌ|| శ్రీ రనీల్‌ విక్రమసింఘే తన సతీమణి ప్రొఫెసర్‌ మైత్రి విక్రమసింఘేతో కలిసి ఆదివారం ఉద‌యం సుప్ర‌భాత‌సేవ‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆలయం వద్దకు చేరుకున్న శ్రీలంక ప్రధాని దంపతులకు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు మ‌హ‌ద్వారం వ‌ద్ద సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

తులాభారం మొక్కు చెల్లింపు

ఈ సంద‌ర్భంగా ప‌డికావ‌లి వ‌ద్ద శ్రీలంక ప్రధాని గౌ|| శ్రీ రనీల్‌ విక్రమసింఘే తులాభారం మొక్కు చెల్లించారు. తులాభారం మొక్కు తిరుమ‌ల‌లో ప్రాచీన కాలం నుండి సంప్ర‌దాయంగా వ‌స్తోంది. ఇందులో భాగంగా భ‌క్తులు తూకం వేసి త‌మ బ‌రువుకు స‌మానంగా చ‌క్కెర, బియ్యం, బెల్లం లేదా చిల్ల‌ర నాణేల‌ను స్వామివారికి కానుక‌గా చెల్లిస్తారు. గౌ|| శ్రీలంక ప్రధాని చిల్ల‌ర నాణేల‌తో తులాభారం వేశారు. కిలో రూ.202/- చొప్పున త‌న బ‌రువుకు స‌మానమైన చిల్ల‌ర నాణేల కోసం భార‌తీయ క‌రెన్సీ రూ.16,160/- చెల్లించారు.

వేదాశీర్వ‌చ‌నం

గౌ|| శ్రీలంక ప్రధాని దంపతులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ త‌రువాత టిటిడి ఈవో, జెఈవో క‌లిసి ప‌ట్టువ‌స్త్రం, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.