SOMASKANDA TAKES RIDE ON KALPAVRIKSHA_ కల్పవృక్ష వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామి కనువిందు
Tirupati, 3 Mar. 19: The processional deity Sri Somaskanda Murthy accompanied by Sri Kamakshi Devi Ammavaru was taken on a celestial ride on Kalpavriksha Vahanam as a part of Kapileswara Swamy temple annual brahmotsavams on Sunday morning.
The kolatam, dance troupes added the devotional quotient to the procession.
The entire vahanam was bedecked with colourful flowers and devotees have given haratis at different points.
Temple DyEO Sri Subramanyam, AEO Sri Nagaraju, Supdt Sri Raj, Priest Sri Swaminathan and Vijaya Swamy, Temple Inspector Sri Reddy Sekhar and others participated.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
కల్పవృక్ష వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామి కనువిందు
తిరుపతి, 2019 మార్చి 03: శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు కల్పవ క్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయకనగర్ ఎల్ టైప్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ ఆలయం, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు ఆకట్టుకున్నాయి.
అనంతరం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు అశ్వవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఇవో శ్రీ నాగరాజు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, అర్చకులు శ్రీ స్వామినాథ స్వామి, శ్రీ విజయస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టరు శ్రీ రెడ్డిశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.