LAURELS POURED ON DR KS JAWAHAR REDDY SERVICES AS EO _ టిటిడిలో పనిచేయడం పూర్వజన్మ సుకృతం

TIRUPATI, 08 MAY 2022: Tons of laurels by various departments of TTD and others during the grand farewell ceremony held at Mahati Auditorium on Sunday evening.

The EO FAC Sri AV Dharma Reddy said be it Go Samrakshana programmes like Govinduniki Go Adharita Naivedyam, Go Pujas, Gudiko Gomata, Go Sammelanam, Navaneeta Seva, Anjanadri Anjaneya, Children’s Hospital and many more, everything was not only well planned but executed and brought into public domain for use by Dr KS Jawahar Reddy as scheduled.

Earlier the legislators Sri B Karunakar Reddy and Dr C Bhaskar Reddy recalled the impeccable services of Dr Reddy during his 19months tenure in TTD as the 27th Executive Officer.

Later the Director of SVIMS Dr Vengamma, SV Veterinary University VC Prof. Padmanabha Reddy remembered their association with Sri Jawahar Reddy and the various development activities executed by him as EO in SVIMS and Vet. Varsity.

The outgoing EO Dr KS Jawahar Reddy thanked every employee of TTD for efficiently discharging their duties and successfully executing various development activities.

Among others who spoke on the occasion included JEO Sri Veerabrahmam, Chief Audit Officer Sri Sesha Sailendra.

Later some Employees’ Union leaders spoke on the occasion and thanked Dr Reddy for making their 30year old dream come true by providing them house sites.

Later the outgoing EO was rendered Vedaseervachanam and felicitated by various associations in TTD.

The vote of thanks was rendered by JEO (H & E) Smt Sada Bhargavi.

CVSO Sri Narasimha Kishore, CE Nageswara Rao, SVBC Chairman Dr Saikrishna Yachendra, SVBC CEO Sri Suresh Kumar, DLO Sri Reddeppa Reddy, all DyEOs, Principals, heads of various departments of TTD and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI 

టిటిడిలో పనిచేయడం పూర్వజన్మ సుకృతం

– సహకరించిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు

– మహతిలో జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి

మే 08, తిరుపతి, 2022: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నానని, తనకు సహాయ సహకారాలు అందించిన అధికారులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని బదిలీపై వెళుతున్న టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అన్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 40 సంవత్సరాలుగా తిరుపతి నగరంతో తనకు అనుబంధం ఉందని, పశు వైద్య విద్య 7 సంవత్సరాల పాటు ఇక్కడే చదువుకున్నానని తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో ఒకటిన్నర సంవత్సరం పాటు స్వామివారి సన్నిధిలో పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. శ్రేయోభిలాషులు, సహోద్యోగులు, పలువురు భక్తులు ఇచ్చిన సూచనలతోనే పలు కార్యక్రమాలను అమలు చేయగలిగానని తెలిపారు. వీటిలో హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి, పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం, అగరబత్తీలు, డ్రైఫ్లవర్ టెక్నాలజీ, వెంగమాంబ ధ్యాన మందిరం, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, గ్రహణమొర్రి, వినికిడి లోపం గల చిన్నారుల కోసం ప్రత్యేక చికిత్స కేంద్రాలు, ఎస్వీబీసీ ఛానల్ లో శ్రీవారి భక్తాగ్రేసరులు కార్యక్రమం ఉన్నాయన్నారు. తాను చేపట్టిన కార్యక్రమాలు చాలావరకు పూర్తయ్యాయని, మరికొన్ని ప్రగతిలో ఉన్నాయని, ఇంకొన్ని ఆలోచనా రూపంలో ఉన్నాయని తెలియజేశారు. తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం పూర్తి చేయాలని, తిరుమల ఘాట్ రోడ్ లో కొండచరియలు పడకుండా నిపుణులు సూచించిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

ప్రపంచ దేశాలన్నీ గో ఆధారిత వ్యవసాయం వైపు చూస్తున్నాయని, రానున్న కాలంలో తప్పక అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. 200 ఏళ్ల పాటు రసాయన ఎరువులు, పురుగు మందులతో భూమి నిస్సారమైందని, గోమయం, గోమూత్రంతో సారవంతం కావాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గో ఆధారిత వ్యవసాయానికి పెద్దపీట వేయనుందని తెలిపారు. టీటీడీ ఉద్యోగుల్లో వృత్తిపరమైన నైపుణ్యం పెంచేందుకు చక్కటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

టిటిడి ఈఓ(ఎఫ్ఎసి) శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన శ్రీ అజేయ కల్లాం హయాంలో తిరుమలలో ఎంతగానో అభివృద్ధి జరిగిందని, ఆ తరువాత టీటీడీ ఈవోగా డాక్టర్ జవహర్ రెడ్డి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. హనుమంతుని జన్మస్థలం అంజనాద్రిని ఆధారాలతో నిరూపించడం ఒక ఉదాహరణగా తెలిపారు.

తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ జవహర్ రెడ్డి కోవిడ్ నియంత్రణ కోసం చక్కగా పనిచేశారని, టిటిడి ఈవోగా సమర్ధవంతమైన పాత్రను పోషించారని చెప్పారు. శ్రీవారి అనుగ్రహంతో రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు స్వీకరించడం సంతోషకరమన్నారు.

చంద్రగిరి శాసనసభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ టిటిడి ఉద్యోగుల పిల్లలకు తక్కువ వ్యవధిలో కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలందించిన ఘనత డాక్టర్ జవహర్ రెడ్డికి మాత్రమే దక్కిందన్నారు. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించారని తెలిపారు. వెటర్నరీ డాక్టర్ కావడంతో గోసంరక్షణ కార్యక్రమాలకు పెద్దపీట వేశారని తెలియజేశారు.

టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ డాక్టర్ జవహర్ రెడ్డి పనే దైవంగా భావిస్తారని, విధినిర్వహణలో ఎంతో అంకితభావంతో పని చేశారని తెలిపారు. గోమాత-భూమాత, చిన్నపిల్లల హృదయాలయ, తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని తెలిపారు.

అనంతరం వెటర్నరీ వర్సిటీ వీసీ ఆచార్య పద్మనాభ రెడ్డి, ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ సాయికృష్ణ యాచేంద్ర, స్విమ్స్ సంచాలకులు డాక్టర్ వెంగమ్మ, సిఏఓ శ్రీ శేషశైలేంద్ర, పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ డాక్టర్ జవహర్ రెడ్డి అందించిన సేవలను కొనియాడారు.

అనంతరం డాక్టర్ జవహర్ రెడ్డిని జ్ఞాపిక, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టిటిడి స్థానిక ఆలయాల నుండి వచ్చిన అర్చక బృందం వేద ఆశీర్వచనం అందజేశారు. జెఈఓ శ్రీ‌మ‌తి భార్గ‌వి వందన సమర్పణ చేశారు.

ఈ కార్యక్రమంలో సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్‌కుమార్‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వర రావు, డిఎల్వో శ్రీ రెడ్డెప్పరెడ్డి, వివిధ విభాగాధిప‌తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.