TTD CANCELS ALL PRIVILEGE DARSHANS ON JULY 16 AND JULY 17_ చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా తిరుమలలో వివిధ ప్రత్యేక ద్రర్శనాలు రద్దు

Tirumala, 12 Jul. 19: In view of Chandra Grahanam, TTD has cancelled various darshans on July 16 and 17.

As the temple remains closed from 7pm of July 16 till 5am of July 17, TTD has already dispensed Divya Darshan and Slotted Sarva Darshan tokens on July 16. Apart from this TTD has also cancelled privileged darshans for Senior Citizen, parents with infants and donors on July 16.

While on July 17, TTD has cancelled Anga Pradakshina and tokens will not be issued on July 16. The devotees are requested make note of all these changes.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా తిరుమలలో వివిధ ప్రత్యేక ద్రర్శనాలు రద్దు

తిరుమల, 2019 జూలై 12: శ్రీ‌వారి ఆల‌యంలో జూలై 16న ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హించ‌నున్నారు. అదేరోజు చంద్రగ్రహణం కారణంగా రాత్రి 7 నుంచి జూలై 17వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం త‌లుపులు మూసివేస్తారు. ఈ సందర్భంగా జూలై 16, 17వ తేదీల‌లో వివిధ ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరుతున్నది.

వయో వృద్దులు, దివ్యాంగులు :

ఈ నేప‌థ్యంలో ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు, సుప‌థం ద్వారా సం|| లోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు, దాతలకు కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాలను జూలై 16వ తేదీ మంగ‌ళ‌వారం టిటిడి రద్దు చేసింది.

జూలై 17న శ్రీ‌వారి ఆల‌యంలో అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ ర‌ద్దు :

తిరుమల శ్రీవారి ఆల‌యంలో ప్ర‌తిరోజు తెల్ల‌వారుజామున భ‌క్తుల‌కు క‌ల్పించే అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ‌ను జూలై 17వ తేదీ చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా టిటిడి ర‌ద్దు చేసింది. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్రత్యేక కార్య‌క్ర‌మాలు నిర్వహించ‌నున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.