SPECIAL OFFICER TAKES CHARGE_ తిరుమ‌ల‌ ప్రత్యేకాధికారిగా శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

Tirumala, 12 Jul. 19: Sri AV Dharma Reddy took over reigns as Special Officer of Tirumala on Friday.

Tirupati JEO Sri P Basanth Kumar handed over the charges to Sri AV Dharma Reddy at Ranganayakula Mandapam in Tirumala temple at the stipulated auspicious time.

After darshan of Lord Venkateswara, Sri Dharma Reddy was offered Vedasirvachanam at Ranganayakula Mandapam. Later TTD EO Sri Anil Kumar Singhal offered Theertha Prasadams and laminated photo frame of Lord to Sri Dharma Reddy and congratulated him.

Speaking to media outside temple he said, he is thankful to almighty for giving him an opportunity for the third time to serve in His abode. “I will definitely strive 24X7 on how to provide easy darshan to pilgrims by minimizing waiting hours”, he added.

CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Lokanadham and others were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

తిరుమ‌ల‌ ప్రత్యేకాధికారిగా శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

తిరుమల, 2019 జూలై 12: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ములు తిరుమ‌ల ప్రత్యేకాధికారిగా శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి శుక్ర‌వారం ఉద‌యం తిరుమ‌ల‌ శ్రీ‌వారి ఆల‌యంలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. తిరుమ‌ల ఇన్‌చార్జ్ జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ రంగ‌నాయ‌కుల మండ‌పంలో తిరుమ‌ల ప్రత్యేకాధికారి శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

అనంత‌రం ప్రత్యేకాధికారి శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ద‌ర్శ‌నానంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌ స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాలు, శ్రీ‌వారి చిత్రపటాన్నిఅంద‌జేశారు.

ఆల‌యం వెలుప‌ల తిరుమ‌ల ప్రత్యేకాధికారి మీడియాతో మాట్లాడుతూ 3వ సారి శ్రీ‌వారి సేవ చేసే అవ‌కాశం క‌ల‌గ‌డం పుర్వ‌జ‌న్మ పుణ్య‌ఫ‌ల‌మ‌న్నారు. శ్రీ‌వారి ఆశీస్సులు ఉండ‌డం వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని సంతోషం వ్య‌క్తం చేశారు.
భ‌క్తులు వేచి ఉండే స‌మ‌యాన్ని త‌గ్గించి సంతృప్తి క‌రంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం, సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు కృషి చేస్తామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, డెప్యూటీ ఈవోలు శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, శ్రీ‌మ‌తి మ‌ల్లీశ్వ‌రి, శ్రీ బాలాజీ, ఎస్ఇ-2 రామ‌చంద్ర‌రెడ్డి, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.