MAHA SAMPROKSHA FETE HELD AT SV TEMPLE, SRIVARI METTU _ శాస్త్రోక్తంగా శ్రీ‌వారిమెట్టు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ

Tirupati, 20 Oct. 21: The Maha Samprokshana fete organised by TTD at the Sri Venkateswara temple,Srivari Mettu,Srinivasa Mangapuram  was grandly conducted on Wednesday morning.

As part of the festivities Maha Shanti Abhisekam, Homas, Purnahuti, Avahana and Archana were performed in the morning and the utsava idol of Sri Bhoga Srinivasa Murthy was installed ahead of the Maha Samprokshana at 11.00 in the Meena lagnam.

Thereafter the rituals of Padma Pradakshina, Jiva Kala Nyasa, Brahma Gosha and Ashirvachanam were also performed.

Temple DyEO Smt Shanti, AEO Sri Dhananjayudu. Kankana bhattar Sri Srinivasa Dikshitulu and Agama adviser Sri Vedantam Vishnu Bhattacharya, archaka Sri Rangacharyulu and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ‌వారిమెట్టు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ

తిరుపతి, 2021 అక్టోబరు 20: శ్రీ‌నివాస‌మంగాపురం స‌మీపంలోని శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద గ‌ల శ్రీ వేంకటేశ్వ‌ర‌ స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం బుధవారం శాస్త్రోక్తంగా జరిగింది.

ఇందులో భాగంగా ఉద‌యం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి అభిషేకం, హోమాలు, పూర్ణాహుతి, ఆవాహ‌న, అర్చ‌న నిర్వ‌హించారు. శ్రీ భోగ‌శ్రీ‌నివాస‌మూర్తి ఉత్సవమూర్తిని ప్ర‌తిష్టించారు. ఉద‌యం 11 గంట‌ల‌కు మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మప్రదక్షిణ, జీవకళాన్యాసం, బ్రహ్మఘోష, ఆశీర్వచనం తదితర కార్యక్రమాలు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, కంకణభట్టార్ శ్రీ ఎం.శ్రీనివాస దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు, అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.