MAHA SAMPROKSHANAM ANKURARPANA HELD _ మొద‌టి ఘాట్ రోడ్డులోని శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయంలో అష్ట‌బంధ‌న మహాసంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్ఫ‌ణ‌

TIRUMALA, 10 APRIL 2022: TTD is organising the Asta Bandhana Maha Samprokshana at Sri Lakshmi Narasimha Swami temple on first Ghat road from April 11-15. For this, the Ankurarpanam ritual was held on Sunday evening.

Series of rituals are lined up for this fete which includes special Pujas, Visesha Homams on April 11 and 12, Asta Bandhanam on April 13, Maha Shanti Abhishekam, Purnahuti etc. on April 14 and Maha Samprokshanam on April 15.

DyEO Sri Ramesh Babu, Chief Priest Sri Venugopala Deekshitulu, Agama Advisor Sri Mohana Rangacharyulu were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

 

మొద‌టి ఘాట్ రోడ్డులోని శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయంలో

అష్ట‌బంధ‌న మహాసంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్ఫ‌ణ‌

తిరుమ‌ల‌, 2022 ఏప్రిల్ 10: తిరుమ‌ల మొద‌టి ఘాట్ రోడ్డులోని శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయంలో ఆదివారం రాత్రి అష్ట‌బంధ‌న మహాసంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్ఫ‌ణ నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా సాయంత్రం 6 గంట‌ల‌కు భ‌గ‌వ‌త్ ప్రార్థ‌న‌, సంక‌ల్పం, ఆచార్య రుత్విక్ వ‌ర‌ణం, విష్వ‌క్సేన పూజ‌, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్పణం జరిగింది.


ఏప్రిల్ 11 నుండి 15వ తేదీ వరకు ప్ర‌తి రోజు ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు విశేష హోమాలు, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వ‌ర‌కు వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి.

ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 9 గంట‌ల‌కు అష్ట‌బంధ‌నం, ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం 4 గంట‌ల‌కు మ‌హాశాంతి అభిషేకం, పూర్ణాహూతి నిర్వ‌హిస్తారు.

ఏప్రిల్ 15వ తేదీ ఉద‌యం 9.30 గంట‌ల‌కు మ‌హా సంప్రొక్ష‌ణ నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ మోహ‌న రంగాచార్యులు, రుత్వికులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.