TTD ON A DIVINE MISSION TO SAVE DESI BOVINE _ తిరుమ‌ల శ్రీ‌వారికి “నవనీత సేవ “

TTD ON A DIVINE MISSION TO SAVE DESI BOVINE

MULLS A NEW SEVA “NAVANEETA SEVA”

TIRUMALA, 06 AUGUST 2021: With a noble aim to protect and promote Desi Cow breeds TTD has decided to introduce a new seva, “Navaneeta Seva” and involve more philanthropists in this Goseva activity, said the Specified Authority Chairman and TTD EO Dr KS Jawahar Reddy. 

The maiden meeting of the Specified Authority of TTD was held at Annamaiah Bhavan in Tirumala on Friday under the Chairmanship of TTD EO Dr KS Jawahar Reddy along with the Convenor and Additional EO of TTD Sri AV Dharma Reddy.

Briefing media persons, after the meeting, the Chairman said, as a part of its divine mission of saving Desi Bovine, the meeting has deliberated on three important tasks which includes protection and promotion of Desi breeds, Goadharita Naivedyam to Srivaru and promotion of organic farming with Cow products (Panchagavya).

The EO also said, we have also negotiated with the experts in SV Veterinary University in Tirupati, to ink a pact on breeding policies, feed mixing and embryo transfer technology to promote Desi Cow breeds. Already we have contemplated commencing the sale of Agarbattis with organic products in Tirumala from August 15 onwards and some other panchagavya products in next three or four months”,  he added.

The EO also briefed on some other important  decisions which includes the following:

* Printing of 2022 Calendars and Diaries of TTD

12-sheet calendars -15lakhs, Deluxe Diaries – 8lakhs, Small Diaries – 2lakhs

*As a part of protecting the environs of Tirumala,  Deployment of electric vehicles in the place of Diesel/Petrol vehicles in a phased manner. To start with, 35 battery cars will be procured through Public Sector unit M/s Energy Efficiency Service Limited(EESL) on a trial basis.

* Development works of certain temples in the state of Andhra Pradesh from SRIVANI Trust funds at Rs.8.94cr upon the advice of Tridandi Chinna Jeeyar Swamy. Reconstruction of Sri Sita Ramaswamy temple in Nellore district at Rs.80lakhs.

*Procurement of Surveillance CCCameras and X-Ray Baggage Scanners as a measure of beefing up security

* Supply and installation of High-end Flat Detector Cathlab system and procurement of Heart-Lung Machine in SV Paediatric Hospital coming up in the Old Block of BIRRD 

*To modernize the TTD Printing Press inviting EoI under PPP with some specific guidelines

* Revamping of Editorial Board of Sapthagiri Magazine with stalwart scholars

JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల శ్రీ‌వారికి “నవనీత సేవ “

– ఆగ‌స్టు 15వ తేదీ నుండి భ‌క్తుల‌కు అందుబాటులో అగ‌ర‌బ‌త్తీలు

– టిటిడి సాధికార మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

తిరుమల, 2021 ఆగ‌స్టు 06: తిరుమ‌ల శ్రీ‌వారి నైవేద్యాల కోసం ప్ర‌తిరోజు అవ‌స‌ర‌మ‌య్యే నెయ్యి దేశ‌వాళీ ఆవుల పాల నుంచి త‌యారుచేయ‌డానికి త్వ‌ర‌లో ” నవనీత సేవ ” పేరుతో ఓ కొత్త సేవ‌ను ప్రారంభించాలని నిర్ణయించిన‌ట్లు టిటిడి సాధికార మండ‌లి ఛైర్మ‌న్‌, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌. జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. సాధికార‌ మండలి సమావేశం శుక్ర‌వారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. స‌మావేశం అనంత‌రం ఈవో మీడియాతో మాట్లాడారు. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– శ్రీ‌వారి ఆల‌యంలో నైవేద్యానికి వినియోగించే ప్ర‌సాదాల త‌యారీకి రోజుకు 30 కిలోల దాకా నెయ్యి అవ‌స‌ర‌మ‌వుతుంది. ఇందుకోసం సుమారు 1200 లీటర్ల పాలు అవసరమవుతాయి. తిరుమ‌ల ఏడు కొండ‌ల‌కు సూచిక‌గా ఏడు దేశ‌వాళీ ర‌కాల ఆవుల‌తోపాటు స్థానికంగా ఉన్న మ‌రో మూడు ర‌కాల దేశవాళీ ఆవుల‌ను క‌లిపి తిరుమ‌లలో 250 నుండి 300 ఆవుల‌ను ఉంచి పాల ఉత్ప‌త్తికి ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం.

– ఈ కార్య‌క్ర‌మానికి భ‌క్తుల నుంచి దేశ‌వాళీ ఆవుల నుంచి త‌యారు చేసిన‌ స్వచ్ఛమైన నెయ్యిని విరాళంగా తీసుకుంటాం. భ‌క్తులు వారి శ‌క్తి మేర‌కు నెయ్యి విరాళంగా ఇవ్వొచ్చు.

– శ్రీవారి నైవేద్యానికి స్వచ్ఛమైన నెయ్యి త‌యారీకి భ‌క్తులు 25 గిర్ గోవులను విరాళంగా అందించారు.

– గోసంరక్షణపై చిత్తశుద్ధితో పని చేసే కుటుంబాలకు చెందిన వ్య‌క్తులను, నిపుణుల‌ను గోసంర‌క్ష‌ణ ట్ర‌స్టులో కో-ఆప్ష‌న్ స‌భ్యులుగా నియ‌మిస్తాం.

– టిటిడి అవసరాలకు తగిన విధంగా గోఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్స‌హించ‌డంలో భాగంగా రాయ‌ల‌సీమ‌ రైతులతో అనుసంధానం చేసుకుని టిటిడికి ప్ర‌తి ఏటా అవ‌స‌ర‌మ‌య్యే ఏడు వేల ట‌న్నుల శ‌న‌గ‌పప్పు కొనుగోలు చేసే అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని నిర్ణ‌యం.

– తిరుప‌తి ఎస్వీ ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యం స‌హ‌కారంతో ప‌శువుల దాణా త‌యారీ ప్లాంట్‌, ప‌శువుల సంతాన ఉత్ప‌త్తికి ఆధునిక పిండ మార్పిడి విధానాలకు సంబంధించి ఎంఓయు చేసుకోవాల‌ని నిర్ణ‌యం.

– తిరుప‌తి ఎస్వీ గోశాల‌లో ఆర్గానిక్ పద్దతిలో త‌యారు చేసిన అగ‌రుబ‌త్తీల‌ను ఆగ‌స్టు 15వ తేదీ నుండి తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతాం. అదేవిధంగా కోయంబ‌త్తూరుకు చెందిన ఆశీర్వాద్ సంస్థ ద్వారా 4 నెల‌ల్లోపు పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులైన స‌బ్బు, షాంపు, ధూప్ స్టిక్స్. ఫ్లోర్ క్లీన‌ర్ లాంటి 15 ర‌కాల ఉత్ప‌త్తులను అందుబాటులోకి తీసుకువ‌స్తాం. వీటి త‌యారీకి తిరుప‌తి డిపిడ‌బ్ల్యు స్టోర్‌లోని భ‌వ‌నాల‌ను ఉప‌యోగించుకుంటాం.

– శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటి వరకు రూ.150 కోట్లు విరాళంగా అందింది. శ్రీవాణి ట్రస్టు దాత‌ల‌కు వీఐపీ బ్రేక్ దర్శనాల్లో ప్రాధాన్య‌త ఇవ్వాలని నిర్ణయం.

– టిటిడి ముద్ర‌ణాల‌యంలో ఏటా రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల విలువ‌య్యే ప‌నులు జ‌రుగుతున్నాయి. పిపిపి విధానంలో అధునాత‌న యంత్రాలు ఏర్పాటుచేసి అభివృద్ధి చేయ‌డానికి ఆస‌క్తి క‌లిగిన వారిని ఆహ్వానించేందుకు విధివిధానాలు ఖ‌రారు చేయాల‌ని నిర్ణ‌యం.

– స‌ప్త‌గిరి మాసప‌త్రిక ఎడిటోరియ‌ల్ బోర్డును ఇటీవ‌ల నిష్ణాతులైన పండితుల‌తో ఏర్పాటు చేశాం. త్వ‌ర‌లో మాస‌ప‌త్రికను పుస్త‌క రూపంలో స‌రికొత్త రూపంతో పాఠ‌కులకు అందుబాటులోనికి తీసుకువ‌స్తాం.

– తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం డీజిల్‌/పెట్రోల్‌ వాహనాల స్థానంలో విద్యుత్‌ వాహనాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయం. తొలిదశలో ప్రయోగాత్మకంగా 35 విద్యుత్ కార్లను ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌(ఇఇఎస్‌ఎల్‌) ద్వారా నెల‌కు రూ.32 వేలు చొప్పున అద్దె చెల్లించి తీసుకోవాల‌ని నిర్ణయం. ఐదేళ్ల త‌రువాత ఈ వాహ‌నాలు టిటిడి సొంత‌మ‌వుతాయి.

– 2022 సంవత్సరానికి గాను 12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, డీలక్స్‌ డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 2 లక్షలు ముద్రించేందుకు ఆమోదం.

– టిటిడి పరిపాలనా భవనం, ముద్రణాలయం, రవాణా విభాగంలో సిసిటివి నిఘా ఏర్పాటుకు గాను హైదరాబాద్‌కు చెందిన స్వస్తికా టెక్నాలజీస్‌ సంస్థకు రూ. 2 కోట్లతో టెండర్లు ఖరారు.

– భద్రతా చర్యల్లో భాగంగా 22 బ్యాగేజి స్కానర్ల కొనుగోలుకు రూ.4.27 కోట్లు మంజూరుకు ఆమోదం.

– శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్‌స్వామివారి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఉన్న పలు ఆలయాల అభివృద్ధిపనులకు గాను రూ.8.94 కోట్లు టిటిడి ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా చేెపడతారు. ఇందులో చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండ‌లం విఠలం గ్రామంలోని పురాత‌న శ్రీ విఠ‌లేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం రాతి క‌ట్ట‌డం కోసం రూ.6 కోట్ల‌కు పైగా మంజూరు.

– నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలోని శ్రీసీతారామస్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి అవసరమైన కోటి రూపాయాలకు గాను రూ.80 లక్షలు శ్రీ‌వాణి ట్ర‌స్టు నుంచి టిటిడి ఆర్థిక సహాయం అందించాల‌ని నిర్ణ‌యం. మిగిలిన రూ.20 లక్షలు స్థానికులు త‌మ వాటాగా అందిస్తారు. ఈ పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా చేెపడతారు.

– బర్డ్‌ పాత భవనంలో తాత్కాలికంగా ఏర్పాటుచేస్తున్న ఎస్వీ చిన్నపిల్లల ఆసుపత్రిలో ఫిలిప్స్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ ద్వారా రెండేళ్ల వారంటీతో రూ.6 కోట్లతో అధునాతన ఫ్లాట్‌ డిటెక్టర్‌ క్యాథ్‌ ల్యాబ్‌ వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం.

– అదేవిధంగా, ఈ ఆసుపత్రికిగాను హైదరాబాద్‌కు చెందిన ఆర్కం మెడికల్‌ డివైజెస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ నుండి రూ.2.30 కోట్లతో 3 హార్ట్‌ లంగ్‌ యంత్రాలు కొనుగోలుకు ఆమోదం.

– టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఉద్యోగులు మ‌రింత మెరుగ్గా విధులు నిర్వ‌హించేందుకు వీలుగా బెంగ‌ళూరుకు చెందిన సంస్థ విరాళ ప్రాతిప‌దిక‌న వ‌ర్క్ స్టేష‌న్లు ఏర్పాటుకు అనుమ‌తి.

ఈ మీడియా స‌మావేశంలో అదనపు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.