MAJESTIC SRI RAMA PATTABHISHEKAM AT SRI KRT _ శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా శ్రీరామపట్టాభిషేకం

Tirupati, 23 April 2021: As part ongoing of the Sri Ramanavami celebrations, the spectacular fete of Sri Rama Pattabishekam was conducted in the Sri Kodandarama Swamy temple on Friday night in ekantham due to COVID-19 guidelines.

Earlier the utsava idol was given Chaturdasha Kalasha Snapana thirumanjanam in the temple Yagashala after morning rituals of Tomala and Sahasra Namarchana and Agni pratista.

As part of colourful, devotional lyrics vibrant and traditional Sri Rama Pattabhishekam fete TTD Archakas organised host of Agama rituals and thereafter the utsava idols were taken in a procession inside the temple premises.

Temple special grade DyEO Smt Parvati, AEO Sri Durga Raju, Superintendent Sri Ramesh, archakas and staff were present.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సింహ వాహనంపై కోదండరాముడు

ఒంటిమిట్ట, 2021 ఏప్రిల్ 23: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడ‌వ‌‌ రోజు శుక్ర‌వారం రాత్రి సింహ వాహ‌నంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమైంది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను సంహరించడంలో నేను, నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూప‌రింటెండెంట్లు శ్రీ వెంక‌టాచ‌ల‌ప‌తి, శ్రీ వెంక‌టేశ‌య్య‌, కంక‌ణ‌బ‌ట్ట‌ర్ శ్రీ రాజేష్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ధ‌నంజ‌యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.