MAKE ELABORATE ARRANGEMENTS FOR TIRUCHANUR ANNUAL BRAHMOTSAVAMS – TTD EO _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు – టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు
Tirupati, 28 October 2024: TTD EO Sri J.Syamala Rao has directed the officials to make elaborate arrangements to ensure against any inconvenience to the devotees coming for the annual Kartika Brahmotsavams of Sri Padmavati Temple at Tiruchanoor which is scheduled from November 28-December 4.
Reviewing the Brahmotsavam arrangements on Monday in the Conference Hall of the TTD Administrative Building he instructed the officials of all the departments to keeping the past experiences and work in coordination to organise the festival on the lines of Tirumala Srivari Brahmotsavams.
The EO directed the concerned officials to complete the engineering works like drinking water, rangolis, queue lines , barricades etc. at the earliest.
Among others the electrical decorations in the temple and surrounding areas, PA system and LED screens, the cultural, religious, music programs under auspices of the Hindu Dharma Prachara Parishad at the Mahathi Kalakshetra, Annamacharya Kalamandiram, Ramachandra Pushkarini, Shilparam and Asthana Mandapam in Tirupati to attract the devotees.
He asked officials to prepare a list of dance troupes from other states performing in Vahan seva.
He suggested attractive flower decorations in the Friday Gardens along with continuous distribution of Annaprasadam on the day of Panchmi Theertham days as well on Brahmotsavam days and trained staff should be deployed in vahana Sevas to monitor elephants, horses and bulls.
EO also ordered that sufficient temporary and mobile toilets should be set up, provide better sanitation.
Doctors, paramedical staff along with ambulances and medicines should be kept ready to provide medical services to the devotees.
TTD surveillance and security officials should coordinate with the local police and take up strong security arrangements.
JEO Sri Veerabraham, Temple Deputy EO Sri Govindarajan and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు – టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు
తిరుపతి, 2024 అక్టోబరు 28: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల సమావేశం మందిరంలో సోమవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, నవంబరు 28 నుండి డిసెంబరు 6వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పిఏ సిస్టమ్, ఎల్‌ఇడి తెరలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలన్నారు. వాహనసేవల్లో పాల్గొనే ఇతర రాష్ట్రాల కళాబృందాల జాబితాను సిద్ధం చేయాలన్నారు.
శుక్రవారపు తోటలో పుష్పప్రదర్శనశాలతోపాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు. బ్రహ్మోత్సవాల రోజులతోపాటు పంచమితీర్థం నాడు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనసేవల్లో ఏనుగులు, అశ్వాలు, వృషభాల వద్ద శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలన్నారు.
భక్తులకు సరిపడా తాత్కాలిక, మొబైల్ మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలని, మెరుగ్గా పారిశుద్ధ్యం ఉండాలని ఈవో ఆదేశించారు. భక్తులకు వైద్య సేవలందించేందుకు వైద్యులు, పారామెడికల్ సిబ్బందితోపాటు అంబులెన్సులు, మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. టిటిడి నిఘా, భద్రతా అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పంచమితీర్థం రోజున భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని, ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, సిసిటివిల ద్వారా భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఇతర తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.