MANAGUDI ALAYASOBHA OBSERVED_ తిరుపతిలో ఘనంగా ఆలయశోభ
Tirupati, 12 August 2017: As a part of Managudi programme mulled by TTD, the Alaya Sobha event was observed with religious fervour in temple city of Tirupati on Saturday.
This was observed in Rayalacheruvu Rythu Bazaar Sri Venugopala Swamy temple and also at MR Palle Sri Krishna Swamy temple. The temples were cleansed thoroughly involving locals and the entire premises were decorated with Rangolis and pandals to give a festive look. Later Raksha Kankanams were distributed to devotees.
Meanwhile on August 13 Nagara Sankeertana and August 14 Gopuja and Metlotsavam will be performed in these temples in a big manner.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
తిరుపతిలో ఘనంగా ఆలయశోభ
ఆగస్టు 12, తిరుపతి, 2017 : గోకులాష్టమి పర్వదినం సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తలపెట్టిన మనగుడి కార్యక్రమంలో భాగంగా శనివారం తిరుపతిలో ఆలయశోభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 12 నుంచి 14వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో మనగుడి ఉత్సవం నిర్వహించనున్న విషయం విదితమే.
ఇందులో భాగంగా తిరుపతిలోని రాయలచెరువు రోడ్డులోని రైతుబజార్ సమీపంలో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో, ఎంఆర్.పల్లిలోని శ్రీక ష్ణనగర్‌లో గల శ్రీక ష్ణస్వామి వారి ఆలయంలో ఆలయ శోభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయం, పరిసర ప్రాంతాలను నీటితో శుద్ధి చేశారు. రంగవళ్లులు, తోరణాలతో ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. భక్తులకు గోవిందరక్ష కంకణాలను పంపిణీ చేశారు.
కాగా, ఆగస్టు 13న ఆదివారం నగర సంకీర్తన, ఆగస్టు 14న ఉదయం ఎంఆర్.పల్లిలోని శ్రీక ష్ణస్వామివారి ఆలయంలో గోపూజ, ఉట్లోత్సవం జరుగనున్నాయి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.