CVSO INSPECTS ALIPIRI FOOT PATH DURING WEE HOURS_ అలిపిరి కాలిబాట మార్గంలో సివిఎస్‌వో అర్ధరాత్రి తనిఖీలు

Tirumala, 12 August 2017: The Chief Vigilance and Security Officer of TTD Sri Ake Ravikrishna inspected the Alipiri foot path route during the wee hours of Saturday and personally monitored the security check and divya darshan token issuing system.

He also interacted with pilgrims near Alipiri Padala Mandapam and explained to them about the token process and slot wise darshan system. He also urged them to follow the queue to procure tickets and co-operate with the security personnel during security check. He also informed the pilgrims to be attentive if they are bringing infants and small children along with them.

Earlier, the CVSO also verified the vehicle checking system at Alipiri Toll Gate. He oriented the SPF and TTD Security staff to be more alert while checking the vehicles and should give counselling to the pilgrims on not to carry prohibited items along with them to Tirumala.

SPF DSP Sri Sankar Rao, AVSO Alipiri Sri Gangaraju were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

అలిపిరి కాలిబాట మార్గంలో సివిఎస్‌వో అర్ధరాత్రి తనిఖీలు

ఆగస్టు 12, తిరుమల, 2017: తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరి మార్గంలో కాలినడకన విచ్చేస్తున్న భక్తులకు భద్రతాపరంగా కల్పించాల్సిన ఏర్పాట్లపై టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు తనిఖీలు నిర్వహించారు.

అలిపిరి పాదాలమండపం వద్ద గల కౌంటర్‌లో దివ్యదర్శనం టోకెన్ల జారీని పరిశీలించారు. అక్కడి భక్తులతో నేరుగా మాట్లాడి దివ్యదర్శనం టోకెన్ల జారీ, స్లాట్‌ విధానంపై అవగాహన కల్పించారు. క్యూ పద్ధతిలో టోకెన్లు పొందాలని, సెక్యూరిటి సిబ్బందికి సహకరించాలని సూచించారు. తిరుమలలో పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, లగేజిని కౌంటర్లలో డిపాజిట్‌ చేయాలని కోరారు. కాలిబాట మార్గంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. నడక మార్గంలో భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండి భక్తులకు భద్రత కల్పించాలని సూచించారు.

అంతకుముందు అలిపిరి చెక్‌ పాయింట్‌లో తిరుమలకు వెళ్లే వాహనాలను తనిఖీ చేశారు. తిరుమలకు వెళ్లే భక్తులకు నిషేధిత వస్తువుల గురించి అవగాహన కల్పించాలని అక్కడి టిటిడి భద్రతా సిబ్బందికి, ఎస్‌పిఎఫ్‌ సిబ్బందికి సూచించారు. మరింత కట్టుదిట్టంగా వాహనాల తనిఖీ చేపట్టాలన్నారు.

ఈ తనిఖీల్లో ఎస్‌పిఎఫ్‌ డిఎస్‌పి శ్రీ శంకర్‌రావు, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు ఇతర భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.