MARGASIRA MASA VISHNU VAIBHAVAM FROM DECEMBER 15 ONWARDS _ డిసెంబరు 15 నుంచి మార్గశిర విష్ణు వైభవ ప్రవచనం

Tirumala, 14 Dec. 20: As the auspicious Dhanurmasa is commencing from December 16 onwards, TTD has mulled yet another spiritual live Pravachanam program on Nada Neerajanam platform at Tirumala from December 15 onwards.

After receiving overwhelming response for Karthika Purana Pravachanam rendered by renowned Vedic Scholar Sri Maruti on Nada Neerajanam stage during the holy month of Karthika which concluded on Monday, TTD has all set for “Marghaseersha Vishnu Vaibhavam Pravachanam”, which will be presented by Vedic exponent Sri Seshacharyulu.

This programme will also be telecast live on SVBC every day from Nada Neerajanam platform at Tirumala between 6am and 6:45am till January 14 next.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబరు 15 నుంచి మార్గశిర విష్ణు వైభవ ప్రవచనం

తిరుమల. 14 డిసెంబరు 2020: పవిత్ర మైన ధనుర్మాసం సందర్బంగా ప్రతిరోజు మార్గశిర విష్ణు వైభవ ప్రవచనం నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమల నాద నీరాజన వేదిక మీద డిసెంబరు 15వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ దాకా రోజు ఉదయం 6 నుంచి 6-45 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఎస్వీ బీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నాదనీరాజన వేదిక మీద టీటీడీ నిర్వహించిన కార్తీక పురాణ ప్రవచనానికి భక్తుల నుంచి భారీ స్పందన లభించింది. వేద పండితులు శ్రీ మారుతి నిర్వహించిన ఈ ప్రవచనం సోమవారంతో ముగిసింది.

భక్తుల స్పందన వల్ల మార్గశిర మాసంలో కూడా ఇలాంటి ప్రవచనం కార్యక్రమం నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. వేద పండితులు శ్రీ శేషాచార్యులు నెల రోజుల పాటు ప్రవచనం చెబుతారు. ఎస్వీ బీసీ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది