TAKE UP BEAUTIFICATION OF GHAT ROADS- TTD EO _ ఘాట్ రోడ్లలో పూల మొక్కలు విరివిగా పెంచండి – ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశం

Tirupati, 14 Dec. 20: Enrich the look both Ghat Roads by planting floral plants, directed TTD EO Dr KS Jawahar Reddy.

During the senior officers meeting held at Conference Hall in TTD Administrative Building on Monday evening, the EO instructed the Forest wing officials to take up beautification of both Ghat Roads on a faster pace. “Cover the rocky structures with green carpets by planting decorative and attractive saplings”, he added.

EO also directed the concerned to speed up the works of Pavitra Udyanavanams.

As the iron mesh arranged to check the fall of boulders due to heavy rains found damaged at some places on second ghat road, the EO instructed the CE to immediately take up their renovation.

He told JEO Tirupati Sri Basanth Kumar to bring Comprehensive Medical Software placed at BIRRD hospital into usage.

The EO also asked the Additional EO Sri AV Dharma Reddy to submit an action plan over the development works of SV Museum at Tirumala.

Later he instructed the HDPP officials to bring to light the unseen kritis of Annamacharya and also conduct Bhagavat Gita competition to students on the occasion of Gita Jayanthi.

JEO Health and Education Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, CE Sri Ramesh Reddy, FACAO Sri Balaji were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఘాట్ రోడ్లలో పూల మొక్కలు విరివిగా పెంచండి- డిఎఫ్ఓ కు ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశం

తిరుపతి. 14 డిసెంబరు 2020: భక్తులు ఘాట్ రోడ్డులోకి వస్తూనే ఆహ్లాదకరమైన అనుభూతి పొందేందుకు రెండువైపులా విరివిగా పూల మొక్కలు పెంచాలని టీటీడీ ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి డిఎఫ్ఓ ను ఆదేశించారు.

టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశమందిరంలో సోమవారం సాయంత్రం సీనియర్ అధికారులతో ఈఓ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ బండరాళ్లు ఎక్కువగా కనిపించే చోట వాటిని కప్పేసేలా పెరిగే మొక్కలు నాటాలన్నారు. తిరుమలలో పవిత్ర ఉద్యాన వనాల ప్రారంభానికి త్వరగా చర్యలు తీసుకోవాలని ఉద్యాన విభాగం డి.డి ని ఆదేశించారు.

ఘాట్ రోడ్ల లో బండరాళ్లు పడే అవకాశం ఉన్న చోట రక్షణ కోసం ఏర్పాటు చేసిన మెష్ లు అక్కడక్కడ దెబ్బతిన్నట్లు కనిపిస్తోందనీ, అలాంటి చోట వీటిని పటిష్ట పరచాలని చీఫ్ ఇంజినీర్ కు సూచించారు. బర్ద్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కాంప్రహెన్సివ్ మెడికల్ సాఫ్ట్ వేర్ ను త్వరగా అమల్లోకి తెచ్చే ఏర్పాటు చేయాలని జెఈఓ కు సూచించారు. తిరుమల మ్యూజియం అభివృద్ధి మీద యాక్షన్ ప్లాన్ ఇవ్వాలని అదనపు ఈఓను కోరారు. ఇప్పటి దాకా వెలుగు చూడని అన్నమయ్య సంకీర్తన లను వెలుగులోకి తెచ్చేలా ప్రణాళిక తయారు చేయాలన్నారు. పిల్లల్లో భక్తి భావం పెంచేందుకు గీతా జయంతి రోజు వారికి భగవద్గీత పోటీలు నిర్వహించాలని హెచ్ డిపిపి అధికారులను ఆదేశించారు.

అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డి, జెఈఓలు శ్రీ బసంత్ కుమార్, శ్రీమతి సదా భార్గవి, చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఎఫ్ఏసిఓ శ్రీ బాలాజి, సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది